హేబా .. మ‌ళ్లీ సంత‌కం పెట్టేసింది!

Update: 2015-12-03 04:04 GMT
'అలా ఎలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. కుమారి 21 ఎఫ్ మూవీతో తెలుగులో రచ్చ చేయడం స్టార్ట్‌ చేసింది హేబా ప‌టేల్‌. 16 ప్రాయం ప‌డుచు పిల్ల‌గా బోల్డ్ యాక్టింగ్‌ తో బాగానే క‌ట్టిప‌డేసింది. కాలేజీ కెళ్లే అమ్మాయిలు ఇంతే గురూ.. అన్నంత స్పీడ్ చూపించింది. అవ‌త‌లివాడు ఎంత పెద్ద మ‌గాడైనా ఐ ల‌వ్ యూ చెప్పేసే మ‌న‌స్త‌త్వం కొంద‌రు అమ్మాయిల‌కే ఉంటుంది. ఆ తెగువ ఈ అమ్మ‌డిలో క‌నిపించింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయింది. వ‌స్తూనే బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించింది. అందుకే ఇప్పుడు వ‌రుస‌గా అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయ్‌. వేడిగా పొంగు మీద ఉన్న‌ప్పుడు నాలుగు అవ‌కాశాలు అందుకోవాలి మ‌రి.
         
ఆ కోవ‌లోనే ఏటీవీ అనీల్ సుంక‌ర నిర్మించే సినిమాకి సంతకం చేసింది హేబా. సుశాంత్‌ తో ఆటాడుకుందాం రా.. మంచు విష్ణుతో స‌ర‌దా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇందులో విష్ణు - రాజ్ త‌రుణ్ హీరోలుగా న‌టించ‌నున్నారు. ఓ పంజాబీ సినిమాకి రీమేక్ ఫిలిం ఇది. సినిమా న‌చ్చి అనీల్ సుంక‌ర ఫ్యాన్సీ రేటుకి రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకున్నార‌ని స‌మాచారం.
         
వాస్త‌వానికి కుమారి 21 ఎఫ్ మూవీకి హేబా ప‌టేల్‌ ని ఎంపిక చేసుకున్న‌ప్పుడు బోలెడ‌న్ని విమ‌ర్శ‌లొచ్చాయి. అంత అందంగా లేదే అని అంతా క్రిటిసైజ్ చేశారు. కానీ ఇప్పుడు హేబానే కావాలంటున్నారంతా. ద‌టీజ్  పెర్ఫామెన్స్ ప‌వ‌ర్ అన్న‌మాట‌!
Tags:    

Similar News