హెబ్బా పటేల్.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. 'అధ్యక్ష' అనే కన్నడ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. 'అలా ఎలా?' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. ఆ తర్వాత హెబ్బా పటేల్ నటించిన 'కుమారి 21ఎఫ్' మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి, హెబ్బా పటేల్ కి ఫిదా అయిపోయారు.
ఈ సినిమా చూసిన వారు హెబ్బా పటేల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు. కానీ, అందరి అంచనాలను ఆమె తలకిందులు చేసింది. 'కుమారి 21ఎఫ్' అనంతరం హెబ్బా పటేల్ వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలు మినహా.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
చెప్పుకోతగ్గ హిట్లు లేకపోవడంతో ఈ అమ్మడు కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే రీసెంట్ గా హెబ్బా పటేల్ 'ఓదెల రైల్వేస్టేషన్' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. యథార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ అశోక్ తేజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వశిష్ట సింహ, పూజిత పొన్నాడ, సాయి రోనక్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 26న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో డైరెక్ట్ గా విడుదల అయింది. సైకో థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకున్న 'ఓదెల రైల్వేస్టేషన్' ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. దీంతో ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది.
కెరీర్ స్టార్టింగ్ నుంచీ గ్లామర్ పాత్రల్లోనే మెరిసిన హెబ్బా పటేల్.. ఈ మూవీలో తొలిసారి డీ గ్లామర్ క్యారెక్టర్‌లో కనిపించింది. హెబ్బాకిది కొత్త తరహా పాత్రే అయినప్పటికీ.. అద్భుతంగా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.
మొత్తానికి ఈ మూవీతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిన హెబ్బా పటేల్ ను ఇప్పటికైనా దర్శకనిర్మాతలు పట్టించుకుంటారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోలు కాకపోయినా టైర్-2 హీరోలకు హెబ్బా పటేల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మరి టైర్-2 హీరోల సినిమాల్లో అయినా హెబ్బా పటేల్ కు ఆఫర్లు దక్కుతాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.