హెబ్బా వెన‌క నీడలా వెంటాడుతున్న‌ది ఎవ‌రు?

Update: 2021-04-27 17:30 GMT
`కుమారి 21 ఎఫ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా అర‌డ‌జ‌ను సినిమాల‌కు సంత‌కాలు చేసింది హెబ్బా ప‌టేల్. త‌న‌వైపు వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌ని ఈ ముంబై బ్యూటీ కేవ‌లం అడ్వాన్సుల‌పైనే దృష్టి సారించిన ప్ర‌భావం కెరీర్ పై ప‌డింది. ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడా త‌ర్వాత అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించినా అస్స‌లు హిట్టు అన్న‌దే లేదు.

ఆ క్ర‌మంలోనే హెబ్బా ప‌టేల్ కెరీర్ ముగిసిన‌ట్టేన‌ని అంతా భావించారు. కానీ హెబ్బా ప్ర‌తిభ‌పై న‌మ్మ‌కం ఉన్న ప‌లువురు ఇప్ప‌టికీ అవ‌కాశాలిస్తున్నారు. యాంజెల్-24 కిస్సెస్ వంటి ఫ్లాపుల్లో న‌టించాకా.. నితిన్ భీష్మ‌లో అతిథిగా మెరిసింది. ఇటీవ‌ల రామ్ రెడ్ లోనూ దించ‌క్ సాంగ్ లో న‌ర్తించింది.

2021లోనే `ఒదేలా రైల్వేస్టేష‌న్.. తెలిసిన‌వాళ్లు అనే రెండు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో హెబ్బా వ‌రుస ఫోటోషూట్లు అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా చిరుత పులి తోలు క‌ప్పుకున్న చందంగా... హెబ్బా స‌రికొత్త‌ డిజైన‌ర్ లుక్ కేక పుట్టిస్తోంది. ఫోటోషూట్ లో వాల్ పై హెబ్బా షాడో హైలైట్ అయ్యింది. ఈ లుక్ చూడ‌గానే ఒక అభిమాని స్పందిస్తూ ..``ఈ మాయ‌దారి మ‌హాస‌ముద్రంలోకి మ‌ళ్లీ వ‌చ్చావా?`` అంటూ సెటైరిక‌ల్ వ్యాఖ్య‌ను జోడించాడు.

కొన‌సాగుతున్న సెకండ్ వేవ్ ప్ర‌భావం తో షూటింగులు ఆగిపోయి తార‌ల కెరీర్ పైనా ప‌డుతోంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగిస్తే చాలా వ‌ర‌కూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు రిలీఫ్ వ‌స్తుందనే భావిస్తున్నారు. చిన్న స్థాయి న‌టీన‌టుల కార్మికుల‌ ఉపాధికి గండి ప‌డ‌కుండా కాపాడ‌డం చాలా అవ‌స‌రం. మ‌రో 2నెల‌ల్లో మ‌హ‌మ్మారీ కి స‌రైన సొల్యూష‌న్ ల‌భిస్తుంద‌న్న హోప్ అయితే ఉంది.
Tags:    

Similar News