ఇప్పుడు ప్రతీ సినిమాకి ఓవర్సీస్ కలక్షన్లు అనేవి చాలా కీలకం అవ్వబోతున్నాయి. ఎందుకంటే అక్కడ సినిమాలను మనోల్ళు భారీ రేట్లకు అమ్ముతున్నారు కాబట్టి.. బారీగా వసూళ్ళు వస్తే కాని రికవరీ అవ్వడం కష్టం. అయితే ఒకేసారి రెండు సినిమాలు వచ్చాయనుకోండి.. ఖచ్చితంగా అందులో బాగున్న సినిమాకు ఎక్కొవచ్చి.. ఇతర సినిమాకు దెబ్బ పడుతుంది. ఇప్పుడు హలో వచ్చాక ఎంసిఏ పరిస్థితి అలాగే ఉందని ట్రేడ్ వర్గాల ఉవాచ.
నిజానికి ఎంసిఏ సినిమా పరమ రొటీన్ గా ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒకవేళ రొటీన్ గా ఉన్నా కూడా అందులో కామెడీ మరియు ఇతర ఎంటర్టయిన్మెంట్ గట్టిగా ఉంటుందని అనుకుంటే.. నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాలో మాత్రం అవన్నీ మిస్సయ్యాయ్. అందుకే సినిమాకు ఫస్ట్ రోజునే బిలో యావరేజ్ టాక్ వచ్చేసింది. అయితే ఈరోజు విడుదలైన 'హలో' సినిమాకు ఓవర్సీస్ లో సినిమా చాలా క్యూట్ గా ప్లెజంట్ గా ఉంది అంటూ టాక్ రావడంతో.. ఆ ప్రభావం ఎంసిఏ కలక్షన్లపై పడే ఛాన్సుందట.
అమెరికాలో కూడా సెలవల సీజన్ అయినప్పటికీ.. మంచు పడే సీజన్ కావడంతో.. మన ఎన్నారైలు బాగున్న సినిమాలకే వెళుతుంటారు. అందుకే ఎంసిఏ పంపిణీదారులు ఆందోళన చెందుతున్నారనే టాక్ ఇప్పుడు ఓవర్సీస్ నుండి వినిపిస్తోంది. ఇకపోతే హలో సినిమా తొలిరోజున ఏకంగా 2,00,000 డాలర్లు వసూలు చేసి. 'అఖిల్' సినిమాకు వచ్చిన ఫుల్ రన్ కలక్షన్ ను అధిగమించింది. అది సంగతి.