తాప్సి నుండి అనుష్క వరకు.. నిశబ్దంలో ఎన్నో మార్పులు

Update: 2020-09-24 01:30 GMT
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన 'నిశబ్దం' ఎట్టకేలకు ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అయ్యింది. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్‌ గత ఏడాదిలోనే రావాల్సి ఉండగా షూటింగ్‌ జాప్యం వల్ల ఈ ఏడాది ఆరంభంలో విడుదలకు సిద్దం అయ్యింది. ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకున్న సమయంకు కరోనా కారణంగా సినిమా విడుదల ఆగిపోయంది. మళ్లీ థియేటర్లు ఓపెన్‌ అయితే సినిమాను విడుదల చేయాలని ఎదురు చూస్తున్న మేకర్స్‌ కు థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయ్యేలా కనిపించలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెళ్లడించాడు.

హిందీలో ముంబయి 125 అనే త్రీడీ మూవీని నేను మణిశర్మ కలిసి నిర్మించాం. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆర్థికంగా నష్టపోయాం. ఆ సినిమా తర్వాత విభన్నమైన సినిమాను తీయాలని భావించాను. అప్పుడే ఈ స్క్రిప్ట్‌ ను రాసుకున్నాను. మాధవన్‌ కు ఈ కథ వినిపించిన సమయంలో ఆయనకు బాగా నచ్చింది. తాప్సిని మెయిన్‌ లీడ్‌ గా అనుకుని సినిమా తీయాలనుకున్నాను. తక్కువ బడ్జెట్‌ తో మూవీగా సినిమా తీయాలని ప్లాన్‌ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక సమయంలో కోన వెంకట్‌ కలవడం నా ప్లానింగ్‌ ను ఆయనకు చెప్పడంతో కథ చాలా బాగుంది. దీనికి అంతకు మించి తీస్తే బాగుంటుంది అన్నాడు. దీనిని భారీ స్థాయలో తీసుకు వెళ్తే బాగుంటుందంటూ ఈ కథను ఆయన స్వయంగా అనుష్క వద్దకు తీసుకు వెళ్లి ఒప్పించాడు.

సినిమా నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టినప్పుడు వారిని రిస్క్‌ లో పెట్టడం సరి కాదు అంటూ మూవీని టాకీగా మార్చేశాడు. స్వయంగా ఆయనే ఈ కథకు మాటలు రాశారు. నేను కథను ఇక్కడి బ్యాక్‌ డ్రాప్‌ లో అనుకున్నాను. కాని కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌ లు కూర్చుని సినిమాను అమెరికా బ్యాక్‌ డ్రాప్‌ కు మార్చేశారు. నేను అనుకున్న ప్రాజెక్ట్‌ కు ఫైనల్‌ ఔట్‌ ఫుట్‌ కు చాలా మార్పలు వచ్చాయి. ప్రతిది ప్రేక్షకుల అంచనాలు అందుకునేందుకు కల్పించాల్సి వచ్చిందని దర్శకుడు అన్నారు. తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలవడంతో పాటు కమర్షియల్‌ గా కూడా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను దర్శకుడు వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News