దర్శధీరుడు జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో హల్ చల్ చేయబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా వరుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు రాజమౌళి, చిత్ర బృందం జోరు పెంచేసింది.
ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇటీవల మార్చి 14న సాయంత్రం 'ఎత్తర జెండా..' అంటే సాగే సెలబ్రేషనల్ లిరికల్ వీడియోతో మొదలుపెట్టింది. ఈ లిరికల్ వీడియో రిలీజ్ తరవాత ప్రత్యేక ఇంటర్వ్యూలతో మరింత జోరు పెంచేశారు. శుక్రవారం దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఇప్పటికే టీమ్ దుబాయ్ లో లాండైపోయింది. ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి దర్శకుడు రాజమౌళి ఈ ఉదయమే దుబాయ్ కి వెళ్లిపోయారు. అక్కడ భారీ స్థాయిలో సినిమా ప్రమోషన్స్ ని హోరెత్తించి తిరిగి ఇండియా చేరుకోనున్న టీమ్ ఆ తరువాత మరో భారీ ఈవెంట్ ని నిర్వహించబోతోంది.
ఈ ఈవెంట్ ని మార్చి 19న కర్ణాటకలోని చిక్ మంగళూరులో నిర్వహించబోతున్నారు. ఇది కర్ణాటక స్టేట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే క్రమంలో 'ఆర్ ఆర్ ఆర్' ఈ భారీ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. దీనికి కర్ణాటక సీఎం. బసవరాజ్ బొమ్మై తో పాటు పలువురు స్టార్స్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన బోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే 'ఆర్ ఆర్ ఆర్'టీమ్ మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా పర్యటించబోతోంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ షెడ్యూల్ ని మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. మార్చి 20న బరోడా చేరుకుని అక్కడ ఉదయం 10:30కు అక్కడి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. ఆ తరువాత డిల్లీకి వెళ్లి అక్కడి పీవీఆర్ ప్లాజాలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో సాయంత్రం 5 గంటలకు పాల్గొనబోతున్నారు. అక్కడే ఇంపీరియల్ లాన్ లో రాత్రి 7 గంటలకు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కాబోతున్నారు.
ఇక మార్చి 21 ఉదయం 11 గంటలకు అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకుని 11:30 గంటలకు అక్కడి స్టార్ హోటల్ లో మీడియాతో ముచ్చటించబోతున్నారు. అక్కడి నుంచి జైపూర్ వెళ్లి అక్కడి జెఎన్ ఐటీ జ్యోతిరావు కాలేజీని మధ్యాహ్పం 3 గంటలకు విజిట్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5:10 నిమిషాలకు అక్కడి తావా మహల్ లో ప్రత్యేంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారట.
మార్చి 22 న కోల్ కతా వెళ్లి ఉదయం 10:30 కు ఉనూర్ మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారట. హౌరా బ్రిడ్జిని సందర్శించి 11గంటలకు అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తారట. అక్కడి నుంచి వారణాసికి వెళ్లి సాయంత్రం 5:20కి ఇంటర్వ్యూలు ముగించుకుని 6 గంటలకు గంగాపూజ, హారతిని తిలకించబోతున్నామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ దేశ వ్యాప్తంగా తన మూడు రోజుల ప్రచార టూర్ వివరాలని వెల్లడించింది.