ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కంటే ముందే జాతిరత్నాలు అనే సినిమాతో నాగ్ అశ్విన్ నిర్మాతగానూ సత్తా చాటే పనిలో ఉన్నారు. మార్చి 11న ఈ మూవీ రిలీజవుతోంది. నాగ్ అశ్విన్- నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ తదితరులు ఇందులో నటించారు. అనుదీప్ కెవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజా చిట్ చాట్ లో నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పిన సంగతులివి.
జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ నన్ను సంప్రదించలేదు. నేను అతని లఘు చిత్రాన్ని ఇష్టపడ్డాక.. జంధ్యాల- ఎస్.వి.కృష్ణారెడ్డి చిత్రాల తరహాలో పూర్తి నిడివి గల కామెడీ ఎంటర్టైనర్ చేయాలనే ప్రతిపాదనతో అతని వద్దకు వెళ్ళాను. స్క్రిప్ట్ దశ నుండే నేను అతనికి కొన్ని సూచనలు ఇచ్చాను.
స్టార్ల ఎంపిక విషయానికి వస్తే..లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైమ్ నుండి నవీన్ .. విజయ్ నాకు మంచి స్నేహితులు. నేను మొదట నా మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం విజయ్ - నవీన్ లతో నిర్మించాలని అనుకున్నాను. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అనుదీప్ నాకు కథ చెప్పినప్పుడు నవీన్ సరైన ఎంపిక అని అనుకున్నాను. ప్రియదర్శి - రాహుల్ కూడా ఈ కథను ఇష్టపడినందున వారు మిగతా రెండు ప్రధాన పాత్రలను పోషించేందుకు కుదిరారు.
జాతి రత్నలు కథాంశం విషయానికి వస్తే .. ఇది రెండున్నర గంటల నాన్ స్టాప్ కామెడీ ఎంటర్ టైనర్. ముగ్గురు బుద్ధిహీనులైన కుర్రాళ్ళు తీవ్రమైన నేరంలో చిక్కుకున్నాక దాని నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. మనీ మనీ .. అనగనగా తరహాలో ఇది ఒక కామెడీ ఎంటర్ టైనర్.
అనుదీప్ మంచితనం కామెడీ సెన్స్ నచ్చి ఈ సినిమా చేశాను. ఇకపైనా
నిర్మాతగా కొనసాగాలనే ఉద్దేశ్యం లేదు. కానీ స్వాప్నా సినిమా ద్వారా మంచి కంటెంట్ రిచ్ సినిమాలను ప్రోత్సహిస్తాను... అని నాగ్ అశ్విన్ తెలిపారు.
ప్రభాస్ తో కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ... ఇది విభిన్నమైనది. ఈ చిత్రం కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి కొంత సమయం పడుతుంది. జూలై నుండి షూటింగ్ ప్రారంభిస్తాను.. అని వెల్లడించారు.