సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువైతే అందుకు కారణమేంటో హీరోల్ని అడిగేయడం సహజమే. అలానే చాలా గ్యాప్ తర్వాత `ఏబీసీడీ` అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ కి ఇదే ప్రశ్న తెలుగు మీడియా నుంచి ఎదురైంది. ఈ ప్రశ్నకు అతడి నుంచి ఎలాంటి సమాధానం రాబోతోంది? అని ఎదురు చూసినవారికి షాకిచ్చే ఆన్సర్ వచ్చింది.
ఈ తప్పు నాది కాదు. కావాల్సినన్ని కాల్షీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉంటే మేకర్స్ వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనే అర్థంలోనే ఆన్సర్ ఇచ్చారు శిరీష్. కేవలం సినిమాలు తీసే దర్శకనిర్మాతల వల్లనే ఈ ఆలస్యం అని అన్నారు. ఆన్ లొకేషన్ అల్లు శిరీష్ ఎంతవరకూ జోక్యం చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమే ఇచ్చారు. నటుడిగా ఎదిగేందుకు తీసే సీన్లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాను. హీరోగా ఆమాత్రం జాగ్రత్త ఉండాలి కదా? అని అన్నారు. అది జోక్యం కాదు ఇన్వాల్వ్ మెంట్ అన్న మీనింగ్ లో ఆన్సర్ ఇచ్చారు. శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు విజయం సాధించింది. ఆ తర్వాత ప్రతి సినిమా రిలీజ్ కి మధ్య చాలా గ్యాప్ వస్తున్న సంగతి తెలిసిందే.
ఏబీసీడీ సినిమా రీమేక్ కదా? మార్పు చేర్పుల సంగతేంటి? అంటే.. దాదాపు 50 సీన్లను కొత్తగా రాసుకున్నామని ఒరిజినల్ లోని కేవలం 10-15 సీన్లు మాత్రమే ఉంటాయని సమాధానమిచ్చారు. కొత్తగా రాసుకున్న సీన్లు అన్నిటినీ తెరకెక్కిస్తే అవి సింక్ అవ్వక తిరిగి ఒరిజినల్ లోనే ఉన్నట్టుగా తీయాల్సొచ్చిందని తెలిపారు. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అల్లుశిరీష్ కు సక్సెస్ ని ఇస్తుందా? లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.