ఆ జోక్ పై క్ష‌మాప‌ణ‌లు అడిగిన ర‌ణ‌బీర్ క‌పూర్!

Update: 2022-08-24 17:30 GMT
అలియాభ‌ట్ పై ర‌ణ‌బీర్ వేసిన జోక్ ఎంత‌టి వివాదాస్ప‌దంగా మారిందో తెలిసిందే. ర‌ణ‌వీర్ స‌ర‌దాగా అనేసినా ఆ త‌ర్వాత నెటి జ‌నులు ఓ రేంజ్ లో తాట తీసారు. భార్య‌ని అవ‌మానిస్తావా?  నీ సంగ‌తేంటో?  చూస్తామంటూ! పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గుర‌య్యాడు. తాజాగా అలియాపై వేసిన జోక్ పై ర‌ణ‌బీర్ క్ష‌మాప‌ణ‌లు కోరారు.

ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయకుడిగా న‌టిస్తోన్న `బ్ర‌హ్మాస్ర్త‌` సినిమా ప్రమోష‌న్ లో భాగంగా చెన్నైలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..``నేను నా జీవితంలో  నా భార్యను ఎంత‌గానో ప్రేమిస్తున్నాను. స‌ర‌దాగా వేసిన జోక్ అది. నా మ‌న‌సులో ఎలాంటి త‌ప్పుడు  ఉద్దేశం లేదు. నేను ఎవరినైనా ప్రేరేపించినట్లయితే  క్షమాపణ చెబుతాను.

నేను ఎవ‌ర్ని టార్గెట్ చేయ‌లేదు. బాధ‌పెట్టాల‌న్న‌ది నా ఉద్దేశం కాదు. అనుకోకుండా మాట జారాను. ఎవ‌రినైనా బాధ‌పెట్టి ఉంటే క్ష‌మించండి.  ఈ విష‌యం గురించి ఆలియాతో మాట్లాడాను. ఆమె నవ్వింది. ప‌ట్టించోలేదు అని చెప్పింది. నాకు స‌ర‌దాగా జోకులేసే అల‌వాటుంది. అది ఫెయిలైతే ఇలాగే ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది` అని అన్నారు.

ఓ నెటిజన్‌ ‘పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న `బ్రహ్మాస్త్ర`సినిమాకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదేంటి?’అని ప్రశ్నించ‌గా.. దీనిపై ఆలియా సమాధానం ఇస్తుండగా.. రణ్‌బీర్‌ మధ్యలో కలగజేసుకొని `మా చిత్రాన్ని ఎందుకు భారీగా ప్రమోట్‌ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’ అంటూ ఆలియా బేబీ బంప్‌వైపు చూశాడు.

రణ్‌బీర్‌ మాటలతో ఆలియా ఒక్కసారిగా షాక్‌కు గురవ్వగా `జస్ట్‌ జోక్‌ చేశా`అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రణ్‌బీర్‌. అయితే ఈ విషయాన్ని ఆలియా లైట్‌ తీసుకుంటే.. నెటిజన్స్‌ మాత్రం రణ్‌బీర్‌పై మండిప‌డ్డారు.

`రణ్‌బీర్‌ నీకు బుద్దుందా..? ఒక ప్రెగ్నెంట్‌ మహిళని బాడీ షేమింగ్‌ చేస్తావా? ఆలియా కంటే పదేళ్లు పెద్ద..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్‌లో ఇలాంటి జోకులు వేయడం ఏంటి?  అని నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News