కనుసైగలతోనే శాసించగల ఇమేజ్ ఆయనది. సూపర్‌స్టార్‌గా దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకొన్నాడు. అలాంటి నటుడికి ఎంతటి ఆకర్షణ ఉంటుందో ఊహించొచ్చు. అందుకే ప్రతీ యేటా ఫోర్బ్స్ పత్రికలో అత్యంత ఆకర్షణ శక్తిగల సెలబ్రిటీల్లో ఒకడిగా చోటు సంపాదిస్తుంటాడు రజనీ. ఈయేడాది కూడా ఆయన ఫోర్బ్స్ పత్రికలోకి ఎక్కాడు. అయితే దేశవ్యాప్తంగా చూస్తే రజనీకి 46వ స్థానం దక్కింది. కానీ ఆయన అల్లుడు ధనుష్ మామని మించిపోతూ 37వ స్థానాన్ని చేజిక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధనుష్ కూడా మామకి ధీటుగా ప్రేక్షకుల మనసుని, మీడియా మనసుని చూరగొంటున్నాడని అర్థం చేసుకోవచ్చు.
మీడియాలో వచ్చిన కథనాల్ని, కవర్‌పేజీల్ని, సినిమాల్నీ దృష్టిలో ఉంచుకొని నటీనటుల స్థానాల్ని లెక్కగడుతుంటుంది ఫోర్బ్స్ పత్రిక. సినిమా పరంగా చూస్తే సౌత్ నుంచి అందరికంటే ఎ.ఆర్.రెహమాన్ ముందున్నారు. ఆ తర్వాత సూర్య, రాజమౌళి, రవితేజ, ప్రభాస్, పూరి జగన్నాథ్, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, సంతానం తదితరులు ఫోర్బ్స్ పత్రికలో అత్యంత ఆకర్షణీయమైన సెలబ్రిటీలుగా చోటు సంపాదించుకొన్నారు. జాతీయ స్థాయిలో మాత్రం షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లు తొలి రెండు స్థానాల్ని సొంతం చేసుకున్నారు. గతేడాది వందమందిలో చోటు సంపాదించుకొన్న విజయ్, అజిత్ లాంటి కథానాయకుల పేర్లు ఈ సారి గల్లంతయ్యాయి.