పరిశ్రమలో అవకాశాలు రావాలంటే ఎన్నో మార్గాలు ఎన్నో ఎత్తులు. కొందరికి స్వతహాగా టాలెంట్ ను బట్టి కొందరికి అదృష్టాన్ని బట్టి కొందరిని బ్యాక్ గ్రౌండ్ ని బట్టి వస్తుంటాయి. ఇవేవి పని చేయనప్పుడు కొందరు వేసే ఎత్తులు మహా విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. అతనో యూత్ హీరో. మంచి స్మార్ట్ గా ఉంటాడు. కొన్ని సినిమాలు బాగానే ఆడాయి కాని ఈ మధ్య టైం అస్సలు కలిసి రావడం లేదు. దర్శకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్మాతలు తమ పెట్టుబడులకు భయపడి దూరంగా ఉంటున్నారు. అధిక శాతం ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు.
అయితే ఇతనితో ఫ్రెండ్ షిప్ మాత్రం అందరికి బాగానే ఉంది. దాన్ని వాడుకునే ఇటీవలి కాలంలో తనకు పరిచయమున్న దర్శకులకు ఖరీదైన వాచీలను కానుకగా ఇవ్వడం మొదలుపెట్టాడు. సందర్భం ఉందా సరే లేదా తనే సృష్టించుకుని మరీ వెతికి పట్టుకుని మరీ ఇస్తున్నాడు. అంతా బాగానే ఉంది. సదరు వాచీల బ్రాండు మార్కెట్ లో వాటి విలువ తెలిసిన దర్శకులు కళ్ళకు అద్దుకుని తీసుకున్నారు. ఆ బ్రాండ్లలో కనీస ధర 20 వేలతో మొదలుకుని పది లక్షలు ఇరవై లక్షలు అంటూ అంతకంటే ఎక్కువగానే ఉంటాయి.
అయితే ఓ కుర్ర దర్శకుడికి తీసుకున్న తర్వాత డౌట్ వచ్చింది. తనకిచ్చిన వాచీ లక్షల్లో ఖరీదు చేస్తుంది అని ఆ హీరో పదే పదే చెప్పడంతో అనుమానం వచ్చి ఓ ఖరీదైన బ్రాండెడ్ షో రూమ్ కు వెళ్లి చెక్ చేయించాడు. అంతే అవాక్కయ్యే మతిపోయే నిజం ఒకటి తెలిసింది. అది డూప్లికేట్ వాచ్ అని. అంతే ఒక్కసారిగా షాక్ తిన్న దర్శకుడు మారుమాట్లాడకుండా ఆ హీరో కిలోమీటర్ దూరంలో కనిపించినా చాలు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోతున్నాడట. అంతే కొందరు సినిమా హీరోల ముచ్చట్లు ఇలాగే ఉంటాయి.
Full View