తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. ఈ సినిమాకు అనంత్ మహదేవన్ - మాధవన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని వారాల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టుగా దర్శకుడు అనంత్ మహదేవన్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
కొన్ని అనివార్య కారణాల వల్ల 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమా నుండి తప్పుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని మాధవన్ ధృవీకరిస్తూ "అనంత్ మహదేవన్ ఒక టాలెంటెడ్ ఫిలిం మేకర్. కానీ కొన్ని అనివార్య కారణాలు.. ఇతర కమిట్మెంట్స్ వల్ల అయన ఈ సినిమాకు దర్శకత్వం వహించలేకపోతున్నాడు" అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అనంత్ ఈ సినిమానుండి తప్పుకోవడంతో ఈ సినిమా దర్శకత్వ భాద్యతలు పూర్తిస్థాయిలో స్వీకరిస్తానని కూడా తెలిపాడు.
'రాకెట్రీ' తన మనసుకు దగ్గరగా ఉండే ప్రాజెక్ట్ అని.. అవుట్ పుట్ చక్కగా వస్తోందని.. నంబి నారాయణన్ అధ్బుత కథను ఈ ప్రపంచానికి చెప్పేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని తెలిపాడు. 1994 లో దేశద్రోహం కేసులో శిక్ష అనుభవించి.. ఫైనల్ గా అయన తప్పేమీ లేదని నిరూపణ అయిన తర్వాత నిర్దోషిగా విడుదలైన ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Full View