దుల్కర్ ఖాతాలో మరో హిట్టు బొమ్మ అవుతుందా..?
దుల్కర్ నెక్స్ట్ సినిమా ఏది అవుతుంది అన్న చర్చ జరుగుతుండగా ఈలోగా కాంతా అంటూ ఒక పీరియాడికల్ మూవీతో రాబోతున్నాడు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సొంత భాషలో కన్నా టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్నాడు. మహానటిలో జెమిని గణేశన్ పాత్ర చేసిన దుల్కర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత సీతారామం తో సోలో హిట్ అందుకున్నాడు. అదేంటో సీతారామం సినిమా చూశాక ఈ కథ దుల్కర్ కోసమే అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత చాలా కథలు వచ్చినా మళ్లీ లక్కీ భాస్కర్ తోనే దుల్కర్ మరో హిట్ అందుకున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ వరకు పెద్దగా బజ్ రాలేదు కానీ సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ అవ్వడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.
దుల్కర్ నెక్స్ట్ సినిమా ఏది అవుతుంది అన్న చర్చ జరుగుతుండగా ఈలోగా కాంతా అంటూ ఒక పీరియాడికల్ మూవీతో రాబోతున్నాడు. ఐతే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు. తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తెలుగు, తమిళ బైలింగ్వెల్ మూవీ. ఈ సినిమా కథ 1950 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని టాక్. సినిమాలో మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది.
సాధారణంగా కథ నచ్చితేనే దుల్కర్ సినిమా కమిట్ అవుతాడు. లక్కీ భాస్కర్ సినిమా చూశాక దుల్కర్ కథల విషయంలో తను ఎలా ఆలోచిస్తాడన్నది అర్ధమైంది. అందుకే దుల్కర్ పిక్ చేశాడు అంటే కచ్చితంగా కథలో కానీ, కథనంలో కానీ ఆడియన్స్ ని మెప్పించే పాయింట్ ఉంటుందని ఫిక్స్ అవుతున్నారు. కాంతా సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా రానా సహ నిర్మాతగా ఉంటున్నాడు.
రానా కూడా కంటెంట్ ఉన్న సినిమాలకు తన సపోర్ట్ అందిస్తాడు. సో తెలుగు రిలీజ్ విషయంలో రానా బాధ్యత మీద వేసుకుంటాడని తెలుస్తుంది. ఎలాగు దుల్కర్ కి తెలుగు మార్కెట్ బాగుంది కాబట్టి కాంతా సినిమాకు బీభత్సమైన బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కచ్చితంగా దుల్కర్ అంచనా ప్రకారం ఈ కాంతా కూడా మరో సూపర్ హిట్ బొమ్మ అవుతుందని అనుకుంటున్నారు. కాంతా సినిమా విషయంలో ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. దుల్కర్ సినిమా అప్డేట్స్ తో సౌత్ ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి అవుతున్నారు.