తెలుగు సినీపరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సినీపెద్దల్ని సీఎం జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం సీఎంని కలిసేందుకు వెళతారని కూడా కథనాలొచ్చాయి. అయితే దీనికి సంబంధించిన తాజా అప్ డేట్ లేనే లేదు.
ఇంతలోనే ఏపీ సీఎం జగన్ ని టాలీవుడ్ యువహీరో మంచు మనోజ్ కలిసారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మనోజ్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి తో సానుకూలంగా చాలా ఎక్కువసేపు మనోజ్ భేటీ కొనసాగిందని తెలిసింది. అంతేకాదు ఏపీ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఉత్పాదక అంశాలపైనా చర్చించామని మనోజ్ తెలిపారు.
రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తూ ఆశాజనకమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నారు. అందుకే ఆయనకు బాసటగా నిలిచానని మనోజ్ చెప్పారు. తాజాగా ట్విట్టర్ లో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి దిగిన ఫోటోని మనోజ్ పోస్ట్ చేసారు. ``దూరదృష్టి కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలిసాను. రాష్ట్రం కోసం కొన్ని గొప్ప ఉత్పాదక (అభివృద్ధి) ఆలోచనలను మార్పిడి చేసుకోవడం ఒక గౌరవం.. ఇది గొప్ప విశేషం. సమీప భవిష్యత్తు కోసం సీఎం గారి ప్రణాళికలను విన్నాను. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. జగన్ సార్ .. మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు సమృద్ధిగా బలం మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీ పాలనకు శుభాకాంక్షలు`` అని మనోజ్ వ్యాఖ్యను జోడించారు.
మొత్తానికి యంగ్ హీరో మనోజ్ భేటీ కాకలు రేపుతోంది. సినీపెద్దలను కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారని ప్రచారమైన ఇలాంటి సందర్భంలో ఈ భేటీ క్యాజువల్ గా జరిగినదని భావించాలా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఏపీలో టిక్కెట్టు ధరల అంశాన్ని మనోజ్ ప్రస్తావించారా లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డితో మంచు కుటుంబానికి ఉన్న రిలేషన్ షిప్ నేపథ్యంలోనే మనోజ్ కి ఈ అవకాశం లభించిందని కొందరు భావిస్తున్నారు.
`అహం బ్రహ్మస్మి` ఎంతవరకూ..!
హీరో మంచు మనోజ్ తాను సినిమాల నుంచి విరమిస్తున్నానని ఇక నటించనని ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో మనోజ్ ఆ నిర్ణయం ప్రకటించినా దానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మోహన్ బాబు సహా తన సోదరుడు సోదరి వారించారని కథనాలొచ్చాయి. దాంతో అతడు తిరిగి పునరారంగేట్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ పైనే మనోజ్ దృష్టి సారించారు. కరోనా మహమ్మారీ వల్ల కొన్ని నెలల పాటు వాయిదా పడినా.. ఇటీవల చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారని కథనాలొచ్చాయి.
ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయి తేజ్ కానీ అల్లరి నరేష్ కానీ అతిథిగా కనిపిస్తారని .. పాత్ర నిడివి స్వల్పమే అయినా కానీ కథను మలుపు తిప్పే పాత్ర అని కూడా కథనాలొచ్చాయి. నిమిషం పాటు మెరుపులాంటి సన్నివేశంతో గెస్ట్ కనిపిస్తారట. మనోజ్ కి కంబ్యాక్ మూవీ ఇది. ఎం.ఎం.ఆర్ట్స్ లో నవతరానికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తానని మనోజ్ ఇంతకుముందు తెలిపారు. ఈ చిత్రంలో కొత్తవారికి అవకాశమిచ్చారు. ఈ మూవీ రిలీజ్ తేదీ గురించి మనోజ్ కాంపౌండ్ వెల్లడించాల్సి ఉంటుంది.