ఓ కొత్త కుర్రాడు.. సిక్స్ ప్యాక్ బాడీ.. పక్కనే ఓ కొత్తమ్మాయి.. విలన్లను కొట్టేస్తున్నాడు.. గన్‌లు పేల్చేస్తున్నాడు.. భారీ డైలాగులు చెప్పేస్తున్నాడు.. స్టంట్లు, స్టెప్పులు, సెగలు.. అన్నీ చూపించేస్తున్నాడు.. ఇక కొత్తమ్మాయి కూడా తగ్గట్లేదు.. డ్యాన్సులు వేస్తోంది.. ఎమోషనల్‌గా హావభావాలు చిందిస్తోంది.. అస్సలు ఎక్కడా వెనుకాడట్లేదు.. వాళ్లిద్దరూ ఎవరు అనేగా.. ప్రముఖ హీరో సునీల్ షెట్టి కూతురు అథియా షెట్టి, అలాగే విలన్ క్యారెక్టర్లకు ప్రసిధ్దిగాంచిన ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్.. అదేలే జియా ఖాన్ బాయ్‌ఫ్రెండ్.. ''హీరో'' సినిమాతో మన ముందుకొస్తున్నారు.
స్వయంగా భాయ్ సల్మాన్ ఈ సినిమాను రూపొందించి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు కూడా. ఈరోజే ట్రైలర్ లాంచ్ చేశాడు. ఈ సినిమాలో సూరజ్ భారీ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ రేంజులో స్టంట్లు చేస్తే.. ఇక అథియా కూడా అదరగొట్టేలా చేసింది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే.. ఒక కొత్త జంట ఈ రేంజులో సినిమా చేస్తే దానిని ప్రేక్షకులు చూస్తారా? సాధారణంగా కొత్త పిల్లలు లవ్‌స్టోరీలతో వస్తే కాస్త కిక్కుంటుంది. అలా కాకుండా యాక్షన్ సినిమాలతో వస్తే మాత్రం గతంలో చాలామంది ఇలాగే ఫ్లాప్ అయ్యారు. ఎంత సల్లూ భాయ్ సపోర్టు ఉన్నా కూడా.. సినిమాలో కంటెంట్ ఎలా ఉందనేదే మ్యాటర్. కొత్త పిల్లలు ఇద్దరూ పర్లేదు కాని, కంటెంట్ ప్రస్తుతానికి బాగా అతిగా ఉంది.