ఇండస్ట్రీలో 'టాక్ ఆఫ్ ది టౌన్'గా హీరో జాతిరత్నం..!

Update: 2021-03-13 03:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువహీరో నవీన్ పొలిశెట్టి హాట్ టాపిక్ గా మారాడు. ఎందుకంటే జాతిరత్నాలు సినిమాతో తన సెకండ్ హిట్ అందుకున్నాడు నవీన్. నిజానికి జాతిరత్నాలు సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్ పరంగా జనాల్లోకి బాగా దూసుకెళ్ళింది. అలాగే టీజర్, ట్రైలర్ లతో పాటు సాంగ్స్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. అమాంతం అలా సినిమా పై ప్రేక్షకులలో హైప్ పెంచేసాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న హైప్‌లకు, అంచనాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా వారి అంచనాలను అవలీలగా బీట్ చేసిందని చెప్పాలి. ఈ సినిమా మరో కొత్తదారికి నాంది పలికింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు.

ప్రస్తుతం నవీన్ తన హిలేరియస్ పెర్ఫార్మన్స్ తో 'టాక్ ఆఫ్ ది టౌన్' అయ్యాడు. నవీన్ యాక్టింగ్ గాని కామెడీ టైమింగ్ స్కిల్స్ గురించి ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే యువహీరోను కొనియాడుతున్నారు. అయితే నవీన్ తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. కానీ ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టాడు. ఆ సినిమా అతన్ని హీరోగా పరిచయం చేస్తే ఇప్పుడు జాతిరత్నాలు మూవీ 'స్టార్ పెర్ఫార్మర్'గా మార్చిందని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. అలాగే బడా హీరోలు సైతం సినిమా చూసి నవీన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తన అభిప్రాయాలను షేర్ చేసాడు. కామెడీ సన్నివేశాల్లో నవీన్ యాక్టింగ్ ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవ్వడమేగాక బాగా నవ్వించింది. అలాగే నవీన్ కు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. చూడాలి మరి ఈ యువహీరో ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడేమో!
Tags:    

Similar News