ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉంది. అయితే రీసెంట్ గా ఒక పాట చిత్రీకరణలో భాగంగా చార్మినార్ దగ్గర షూటింగ్ జరిపారట. అయితే అక్కడ రామ్ సిగరెట్ కాల్చడంతో పోలీసులు 200 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది.
పబ్లిక్ ప్లేసులలో పొగ త్రాగడం చట్టప్రకారం నేరమని తెలిసిందే. అందుకే మనం సినిమా చూసిన ప్రతి సారీ మనకు అవేర్ నెస్ పెంచేందుకు ఒకవైపు ముకేష్ యాడ్ తో బెదరగొడతారు.. మరోవైపు 'ఈ నగరానికి ఎమైంది.. ఎవరూ నోరు మెదపరెందుకు' అంటూ ఒక క్లాస్ ఉంటుంది కదా. మరి రామ్..'ఇస్మార్ట్ శంకర్' టీమ్ ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదు? సినిమాలో ఒక సీన్ కోసం రామ్ అలా స్మోక్ చేయాల్సి వచ్చిందట. అంతే.
కానీ రామ్ కు ఫైన్ వేశారనే విషయంపై సోషల్ మీడియాలో నానా హంగామా జరిగింది. కొందరైతే రామ్ షాట్ గ్యాప్ లో సిగరెట్ కాల్చాడని కూడా అన్నారు. దీంతో ఈ విషయంపై హీరో రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. "నా టైము.. పబ్లిక్ టైము వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలె.. షాట్ ల కాల్చిన తమ్మి.. బ్రేక్ ల కాద్.. టైటిల్ సాంగ్ ల చూస్తవ్ గా స్టెప్పు.. ఫిర్ భీ లా కి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. #లైట్ తీస్కో పని చూస్కో - ఉస్తాద్ #ఇస్మార్ట్ శంకర్" అంటూ ఇస్మార్టు స్టైల్ లో ట్వీట్ చేశాడు.