జంగిల్‌ ఫెలోస్‌ అంటూ రామ్‌ ఆగ్రహం..!

Update: 2018-09-17 09:52 GMT
తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన మిర్యాలగూడెం పరువు హత్యపై రాజకీయ - సామాజిక వేత్తలు మాత్రమే కాకుండా సినీ రంగ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్‌ ని చంపించిన అమృత తండ్రిపై ఒకొక్కరు ఒక్కో విధంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మరియు సినీ వర్గానికి చెందిన వారు హత్యపై తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేయగా తాజాగా హీరో రామ్‌ కూడా ఈ సంఘటనపై స్పందించాడు.

ట్విట్టర్‌ లో రామ్‌.. ఒక పక్క సెక్షన్‌ 377 ను ఎత్తి వేస్తుంటే మరోపక్క కులాలు పట్టుకుని వేలాడటం ఏంటి - ఇంకా పరువు హత్యలు ఏంట్రా జంగిల్‌ ఫెలోస్‌ అంటూ తన ఆగ్రహంను వ్యక్తం చేశాడు. మానవత్వం నేర్చుకోవాలంటూ కులాలు పట్టుకుని వేలాడుతున్న వారికి రామ్‌ సలహా ఇచ్చాడు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పరువు హత్యపై స్పందించారు. సింగర్‌ చిన్మయి మాట్లాడుతూ ఇలాంటి పరువు హత్యలు తగ్గాలంటే తమ పేర్ల తర్వాత ఉన్న తోకలు కట్‌ చేసుకోవాలంటూ సూచించింది.

ఇక రామ్‌ ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు. దసరాకు ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న రామ్‌ కు ఈ చిత్రం ఆ సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. త్రినాధ రావు నక్కిన గత చిత్రాలు యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకున్నాయి. కనుక ఈ చిత్రం కూడా తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకంతో దిల్‌ రాజు ఉన్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
Tags:    

Similar News