ఎనర్జిటిక్ స్టార్ రామ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈమద్య కాలంలో రామ్ కు సాలిడ్ సక్సెస్ దక్కలేదు. దాంతో కెరీర్ లో ఇబ్బందికర పరిస్థితులను రామ్ ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో పూరి జగన్నాధ్ పై నమ్మకంతో 'ఇస్మార్ట్ శంకర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాపై రామ్ కు తప్ప ఆయన అభిమానులకు నమ్మకం లేదు. పూరిపై నమ్మకంతో - ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రాన్ని చేస్తున్న రామ్ ఆ తర్వాత చేయబోతున్న సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేయాలని రామ్ ఆశపడుతున్నాడు. తమిళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుని తమిళ సినీ ప్రముఖులతో ప్రశంసలు అందుకున్న 'థడమ్' అనే చిత్రాన్ని రీమేక్ చేయాలని రామ్ భావిస్తున్నాడు. ఆ సినిమాను చూసిన రామ్ సబ్జెక్ట్ బాగా నచ్చడంతో వెంటనే రైట్స్ తీసుకోవాల్సిందిగా తన పెదనాన్న అయిన స్రవంతి రవికిషోర్ కు చెప్పడం - ఆయన ఠాగూర్ మధుతో కలిసి రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడం జరిగిందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంది.
'థడమ్' చిత్రంలో అరుణ్ విజయ్ అనే చిన్న హీరో నటించాడు. ఆ చిత్రంతో అరుణ్ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. యూత్ ఫుల్ స్టోరీ తో రూపొందిన ఆ చిత్రం రామ్ కు తెగ నచ్చిందట. మరి రీమేక్ చేస్తే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి.