కె.ఎల్ రాహుల్-అతియాశెట్టి ప్రేమ కహానీ తెలిసిందే. కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ జంట మీడియా కంట చిక్కని డే అంటూ లేదు. త్వరలోనే పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు కుటుంబాల నుంచి కూడా ఈ జంట పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ వచ్చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది.
అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే శీతాకాలంలో ఈ జంట వివాహ బంధంతో ఒకటవ్వడానికి ఛాన్స్ ఉందని బాలీవుడ్ లీకుల ద్వారా తెలిసింది. ఈ జంట ప్రేమ సంగతి ప్కనబెడితే..పెద్దల అంగీకారం ఎంత వరకూ ఉందన్న దానిపై అధికారికపై ప్రకటన ఇంత వరకూ రాలేదు. రెంటు కుటుంబాలు ఒప్పుకున్నాయని ఓ గాసిప్ లానే తెరపైకి వచ్చింది తప్ప! అతియాశెట్టి తండ్రి నటుడు సునీల్ శెట్టి ఇంత కాలం మౌనం వహించారు.
ఎట్టకేలకు ఆయన కూడా నోరు విప్పడంతో అసలు సంగతి తెలుస్తోంది. పరోక్షంగా ఈ జంట పెళ్లికి తనకెలాంటి అభ్యంతరం లేదన్న వైఖరి ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి పనులు మొదలు పెట్టారా అని ప్రవ్నించగా. లేదు. ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదు' అని అక్కడితో ఆ మ్యాటర్ ని కట్ చేసారు. ఇంతలో అతియాశెట్టి కూడా ఇన్ స్టా ఖాతాలో మూడు నెలలో జరిగే వివాహానికి నన్ను కూడా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు రివీల్ చేసింది.
వీళ్లిద్దరి మాటల్ని బట్టి రాహుల్ -అతియా పెళ్లి ఖాయమనే వార్తలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో మీడియాలో వచ్చిన వార్తలు ..నివేదికలు నిజమేనని! తాజా సన్నివేశాన్ని బట్టి అర్ధమవుతుంది. అంతకు ముందు రాహుల్ గురించి సునీల్ శెట్టి ఎంతో గొప్పగా పొగిడేసారు. ఆ సందర్భంలో కూడా తనయ ప్రేమ గురించి పాజిటివ్ గానే స్పందించారు.
'ఆ అబ్బాయి అంటే నేను అభిమానిస్తా. జీవితంలో ఏం చేయాలో? ఎలా ముందుకు సాగాలి? అన్నది వాళ్లే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే కాలం మారింది. బేటీ ఔర్ బీటా డోన్ హాయ్ అనేసారు. అంటే కుమార్తె..కుమారుడు ఇద్దరు బాధ్యతగల వ్యక్తులు. వారి కెరీర్ ని వాళ్లే మలుచుకుంటారు. నేను కోరుకునేది కూడా అదే. ఎవరైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల్గాలి. అలా తీసుకోలేనప్పుడు జీవితంలో ఎలా ముందుకు వెళ్తారు? అని ప్రశ్నించారు. నా బిడ్డలకి ఎప్పుడు ఆశీస్సులుంటాయని' అన్నారు.
కాగా సునీల్ శెట్టి బాలీవుడ్ హీరో అయినప్పటికీ అతని పూర్వీకులు దక్షిణాదికి చెందిన వారే. ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా మంగళూరు ప్రాంతానికి చెందిన వారే. ఈక్రమంలో అతియా- రాహుల్ వివాహాన్ని కూడా సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.