కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న హీరో శింబు. రొమాంటిక్ మూవీస్‌లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు ఈ హీరో. ఇక ఈయన నటించిన ‘మన్మథ, వల్లభ’ చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన నటించే ప్రతీ సినిమాలోనూ క్యారెక్టర్ కోసం శింబు చాలా కష్టపడతాడట. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా లుక్ చూస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు.. హ్యాట్సఫ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్షన్లో స్టార్ హీరో శింబు నటిస్తున్న సినిమా ‘వెందు తానిందధతు కాదు’. ఇందులో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు శింబు. ఇటీవలే మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసి అసలు హీరో నిజంగా శింబునేనా? అని ప్రశ్నించుకున్నారు సినీ అభిమానులు. శింబును అసలు కొద్ది క్షణాల పాటుగుర్తు పట్టలేకపోయారు. రొమాంటిక్ హీరో కాస్తా ఇలా అయిపోయాడేంటి? అని అనుకున్నారు.
ఈ ఫిల్మ్ కోసం శింబు ఏకంగా ఏకంగా 30 కిలోల బరువు తగ్గాడు. మొత్తంగా శింబు నయా గెటప్ చూసి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే శింబు పాత ఫొటోను ఈ ఫొటోకు జోడించి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే, డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా రొమాంటిక్ ప్లస్ క్రైమ్, ఇంట్రెస్టింగ్ ఫిక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా ఉంటారు. కాగా ఆయన నుంచి వస్తున్న డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అని పేర్కొనగా, కాదు కాదు వెట్రిమారన్ అని కొందరు నెటిజన్లు ఫన్నీగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గౌతమ్‌మీనన్ కూడా తన రూటు మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు సినీ ప్రముఖులు. బోల్డ్ ప్లస్ స్టార్క్ రియాలిటీ సినిమాల వైపునకు తన అడుగులు ఈ చిత్రం ద్వారా వేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇకపోతే శింబు ఈ చిత్రంతో పాటు ‘మహా’ అనే ఫిల్మ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. ‘మానాడు’ చిత్రంలో ముస్లింగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైం ట్రావెల్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇటీవల కాలంలో శింబు నటించిన ‘ఈశ్వరన్’ సినిమా విడుదల కాగా అది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనిందని చెప్పొచ్చు.