దుడుకుతనంతో ఏదో ఒక కామెంట్ చేయడం ఎంత ప్రమాదమో సిద్ధార్థ్ లాంటి హీరోకి స్వీయానుభవం. సోషల్ మీడియాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడూ రాజకీయాలను కూడా టచ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంతకుముందు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఘాటైన కామెంట్ చేసి తర్వాత క్షమాపణలు చెప్పాడు.
రకరకాల కామెంట్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ లోనూ సిద్ధార్థ్ పై ఫిర్యాదులు అందిన సందర్భాలున్నాయి.
ప్రస్తుతం అతడు అందాల నటి అదితీరావ్ హైదరీతో సహజీవనం సాగిస్తున్నాడని కథనాలొస్తున్నాయి. ఆ ఇద్దరూ ఇటీవల ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కారు. వరుసగా ఫ్లాష్ లు మెరుస్తుంటే అతడు నేరుగా మీడియాకి వార్నింగ్ ఇచ్చాడని గుసగుస వినిపిస్తోంది.
నేను ఇక్కడివాడిని కాను.. వెళ్లి లోకల్ వాళ్లను ఫోటోలు తీసుకోండి. ఈసారి ఇంత మర్యాదగా చెప్పను!.. అర్థమైందా? అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. నిజానికి ఏదైనా విషయాన్ని వివాదం చేయాలనుకున్నా లేదా కామ్ గా ఉంచాలన్నా మీడియానే చేయాలి.
అలాంటి మీడియాని ప్రసన్నం చేసుకోకుండా సిద్ధార్థ్ రుసరుసలాడడం సరికాదని కూడా కొందరు సూచిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో అతడు మీడియాతో వ్యవహరించిన తీరుపై విమర్శలున్నాయి.
అప్పట్లో గృహం మూవీ రిలీజ్ సమయంలో మీడియాకి వార్నింగ్ ఇవ్వడం చర్చకు వచ్చింది. దుడుకుతనంతో కూడుకున్న దుందుడుకుతనం వల్లనే అతడు తెలుగు పరిశ్రమలో అవకాశాలు కోల్పోయాడని కూడా అప్పట్లో టాక్ వినిపించింది.