ఇప్పుడు తెరకెక్కుతున్న ఓ బయోపిక్ పై అందరి దృష్టి ఉంది. చరిత్రకారుడు అయిన ఆయన పాత్రలో స్వయంగా ఆయన కొడుకే నటిస్తుండడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే అంగరంగ వైభవంగా షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా.. షూటింగ్ ప్రారంభం జరుపుకుని ఓ నెల గడిచిపోయింది కూడా. ఇలాంటి సమయంలో దర్శకుడు తప్పుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది. చాలా కాలంగా దర్శకత్వం వహించాలనే కోరిక ఉన్న ఆ స్టార్ హీరో.. ఇప్పుడు స్వయంగా దర్శకత్వపు బాధ్యతలు చేపట్టడం కూడా దాదాపు ఖాయం అయిందని అంటున్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు హుందాగా చెప్పడం విశేషమే. అయితే.. అసలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ తప్పుకోవడం వెనుక వేరే రీజన్స్ కూడా ఉన్నాయట. ఆయన తప్పుకోలేదని.. హీరోనే తప్పించారన్నది వాటి సారాంశం. ఇందుకు కారణం ఈ మధ్య వార్తల్లో నిలిచిన ఓ నటీమణి అంటున్నారు. ఓ బడా నిర్మాత కొడుకు విషయంలో ఈమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఆ అంశాన్ని సెటిల్ చేసేందుకు ఈ దర్శకుడు ప్రయత్నించాడనే టాక్ ఉంది. ఓ రెండు సినిమాలు ఆఫర్ చేశాడు కూడా.
అయితే.. ఇండస్ట్రీ మీద బురద చల్లిన ఆమెతో సెటిల్మెంట్ వ్యవహారాలను నడిపించే దర్శకుడు.. ఓ మహనీయుడి బయోపిక్ కి దర్శకత్వం వహించడం అంటే.. ఆ ప్రాజెక్టుపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ స్టార్ హీరో భావించారట. ఇలాంటి సమయంలో ఆ దర్శకుడితో సినిమా చేయించడం.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అనుకున్నారట. అందుకే ఈ దర్శకుడిని తప్పించి.. తనే డైరెక్టర్ సీట్ ఎక్కేస్తున్నారన్నది టాక్.