ఆ మధ్య జరిగిన `మా` ఎన్నికలు ఎంత రసాభాసగా జరిగాయో తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటా పోటీగా పోటీ పడ్డాయి. ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ మద్దతు లభించడంతో అనూహ్యంగా లోకల్, నాన్ లోకల్ నినాదం తెరపైకొచ్చింది. దీంతో మంచి విష్ణు అనూహ్యంగా విజయం సాధించి `మా` అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా వుంటే తాజాగా హీరో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మా వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేలా వున్నాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
శనివారం హైదరాబాద్ లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్` కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు పరిశ్రమ నుంచి కొంత మంది నటులు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని డల్లాస్ లో క్రికెట్ టోర్నీ ఆడబోతున్నారు. ఇంతెలో హీరోలు శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు తో పాటు ప్రిన్స్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు పాల్గొనబోతున్నారు.
వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఆడబోతున్నాడు. విశేషం ఏంటంటే డల్లాస్ వెళ్లే టీమ్ లో `మా` ఎన్నికల్లో పోటీ చేసిన వారే అత్యధికంగా వుండటం గమనార్హం.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీకాంత్ చిరంజీవిని ఉద్దేశించిన మాట్లాడుతూ ప్రస్తుతం `మా` కమిటీపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశారని చెబుతున్నారు. మంచి కార్యక్రమం అంటే చిరంజీవి గారు ఎప్పుడూ ముందుంటారు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసి మూడు మ్యాచ్ లు ఆడి ఆ తరువాత అమెరికా వెళ్లి ఆడటం వల్లే మొదటి సారి `మా`అసోసియేషన్ కి ఫండ్ రైజ్ అయింది.
ఆ డబ్బులే ఇప్పడు `మా`లో వున్నాయి` అని అన్నారు. ఆ తరువాత `మా`కి ఎన్నుకోబడ్డ వారెవరూ అంత ఫిండింగ్ తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం శ్రీకాంత్ అన్న మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రకాష్ రాజ్ తో పోటీపడి `మా` అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి విజయం సాధించిన వారంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆ వైరం ఈ రెండు గ్రూపుల మధ్య ఇప్పటికీ కొనసాగుతూనే వుందని శ్రీకాంత్ మాటల్లో మరోసారి స్పష్టమైందని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా వుంటే మంచి విష్ణు ఇప్పటి వరకు కార్యవర్గ సభ్యులతో రెవండు దఫాలుగా ప్రత్యేకంగా మీటింగ్ ని ఏర్పాటు చేశారు. `మా` బిల్డింగ్, సభ్యుల సంక్షేమం ప్రధాన అజెండాగా గెలుపొందిన మంచు విష్ణు ఇప్పటికీ `మా` బిల్డింగ్ పై ప్రకటన చేయకపోవడంతో పలువురు సీనియర్ ఆర్టిస్ట్ లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా `మా` ఫండ్ విషయంలో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.