అతను ఒక హీరో. ప్రూవ్ చేసుకున్నా కూడా పెద్ద సినిమాలు మాత్రం పడట్లేదు. మనోడి ఎక్సట్రాలు అయితేనేమి.. మంచి కథలను ఎంచుకోవడంలో ఫెయిలవ్వడం కారణంగా అయితేనేమి.. మనోడికి హీరో ఛాన్సులు ఎన్ని వస్తున్నా కూడా ఇతగాడ్ని ఒక హీరోగా మాత్రం ఎవ్వరూ గుర్తించట్లేదు. అందుకే ఒకసారి ఏదన్నా సినిమాలో తానే హీరోగా తానే విలన్ గా ప్రూవ్ చేసుకుని సత్తా చాటాలని అనుకుంటున్నాడు.
నిజానికి ఈ హీరోకు ఇండస్ర్టీలోకి రావడానికి మాంచి కనక్షన్లే ఉన్నాయి. వాటన్నింటినీ వాడేసి ఇప్పటివరకు బాగానే లాక్కొచ్చాడు. అయితే మనోడి బ్యాడ్ లక్ అనండి లేదంటే సరైన కథలను పికప్ చేయడంలో తబడుతున్నాడు అనండి.. ఎంత మంచి కథ వచ్చినా ఎంతటి డైరక్టర్ రంగంలోకి దిగినా కూడా బ్యాండ్ పడిపోతోంది. అందుకే ప్రేక్షకులు కూడా ఇతగాడి సినిమాలంటే బోర్ ఫీలవుతున్నారు. దానితో మనోడు ఓసారి విలన్ వేషాలు వేసి.. తనలోని చావ ఏంటో మరోసారి రుచిచూపిద్దాం అనుకుంటున్నాడట. అలా చేస్తే తన మార్కెట్ కాస్త పటిష్టం అవుతుందని కాబోలు.
ఏదేమైనా కూడా.. సినిమా ఇండస్ర్టీలో ఎక్కువ కాలం మన్నాలంటే మాత్రం హిట్ సినిమాలు చాలా ముఖ్యం. అలాగే వరుసగా విజయాలు ఇస్తేనే ప్రొడ్యూసర్లు డిస్ర్టిబ్యూటర్లు కూడా ధైర్యంగా ఆ హీరోలను నమ్మేది. ప్రతీసారీ ముంచేస్తుంటే వారు మాత్రం ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు ఈ హీరో విషయంలో అదే పరిస్థితి ఏర్పడింది. పైగా తన గాళ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పటి నుండీ అసలు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాడనేది ఇంకో వర్షెన్ రూమర్. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా హిట్టు పడితేనే సీన్ మారేది. కాస్కోండి మరి!!