`మా` ఎన్నిక‌ల‌పై సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-09-13 06:40 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ కాకుండానే  గెల‌పు కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఎన్న‌డూ లేని స‌రికొత్త పోక‌డ ఇప్పుడు `మా` లో క‌నిపిస్తోంది. లంచ్ పార్టీలు..డిన్న‌ర్ లు..మందు పార్టీలంటూ మా కొత్త పోక‌డ‌కు తెర లేపింది. ఓ ర‌కంగా సీన్ చూస్తుంటే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌ద‌న్నేలా క‌నిపిస్తుంది. ప్ర‌ధానంగా పోటీ మంచు విష్ణు-ప్ర‌కాష్ రాజ్ ప్యానల్ మ‌ధ్య కొన‌సాగ‌తుండ‌టంతో ఎవ‌రికి వారు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప‌నిలో ప‌డ్డారు. అలాగే ఇదే  ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కూడా పోటీ చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న నెల్లూరు మీడియా స‌మావేశంలో ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త‌న‌పై వ‌స్తోన్న క‌థ‌నాల్ని అవాస్త‌వాల‌ని తేల్చేసారు. ఆర్టిస్టుల‌ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్లు తెలిపారు. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం త‌న‌కు ఎంతమాత్రం ఇష్టం ఉండ‌ద‌ని...ఏదైనా ఒకే ప‌నిపై ఏకాగ్ర‌త పెట్టి ప‌నిచేస్తేనే స‌క్సెస్ అవుతామ‌ని  అన్నారు. అలాగే టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై క‌డా ఆయ‌న స్పందించారు.  డ్ర‌గ్స్ మ‌త్తు చాలా రంగాల్లో  ఉంది.

కానీ రంగుల ప్ర‌పంచం కావ‌డంతో సినిమా వాళ్లే హైలైట్ అవుతున్నారు. డ్ర‌గ్స్ తీసుకోవ‌డానికి అనేక  కార‌ణాలు ఉన్నాయి. డ్ర‌గ్స్ ని అరిక‌ట్టాలంటే క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాలి. అప్ప‌టివ‌ర‌కూ దీన్ని ఎవ‌రూ ఆప‌లేరు. ఈ రోజు విచార‌ణ చేసి వ‌దిలేస్తే స‌రిపోదు. దాన్ని పూర్తి స్థాయిలో ఎలా రూపుమాపులో తెలుసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే డ్ర‌గ్స్ నుంచి అంతా బ‌య‌ట ప‌డ‌తార‌ని సుమ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈడీ సినీ ప్ర‌ముఖుల్ని విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చార్మి..పూరి జ‌గ‌న్నాథ్..రానా.. ర‌కుల్  త‌దిరుల్ని ఇప్ప‌టికే విచారించింది. కానీ వాళ్ల నుంచి ఒక్క ఆధారం కూడా రాబ‌ట్టలేక‌పోయార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. డ్ర‌గ్స్ స‌ర‌ఫరా చేసిన కెల్విన్ ని ఎదురించి విచార‌ణ చేప‌ట్ట‌గా ఎవ‌రి నుంచి ఎలాంటి స‌మాచారం సేక‌రించారు? అన్న‌ది రివీల్ కాలేదు. ఇంకా మ‌రికొంత మందిని విచారించాల్సి ఉంది. నేడు న‌వ‌దీప్ ని ఈడీ విచారిస్తోంది.  ఈ కేసు లో నిజానిజాలేంటో ఈడీ ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News