బాలా అలా .. సెల్వ ఇలా.. య‌మునా తీరే!

Update: 2019-05-28 14:51 GMT
సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించిన `ఎన్‌ జీకే`  ఈనెల 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్స్ లో సూర్య బిజీగా ఉన్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో సూర్య మాట్లాడుతూ తాను ప‌ని చేసిన ద‌ర్శ‌కుల్లో బాలా ప‌నితీరుకు.. సెల్వ రాఘ‌వ‌న్ ప‌నితీరుకు మ‌ధ్య డిఫ‌రెన్స్ గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు. పెద‌వులు తెర‌చి ఉంచితేనే ఎమోష‌న్ పండుతుంద‌ని బాలా అంటే.. అలా అవ‌స‌రం లేదు మూసి ఉంచితేనే సీన్ పండుతుంద‌ని సెల్వ అంటారు! అంటూ వైరుధ్యాన్ని రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ఒక్కో ద‌ర్శ‌కుడుతో ఒక్కోలా ఔట్ పుట్ తీసుకుంటారు. బాలా స‌ర్ తో ప‌ని చేస్తే త‌ల మ‌రీ ఎత్తొద్దు అనేవారని సూర్య తెలిపారు.  సెల్వ స‌ర్ తో ప‌ని చేసేప్పుడు ఎమోష‌న్ అంతా క‌ళ్ల‌లోనే క‌నిపించాల‌ని అనేవారు. మ‌ధ్య‌లో క‌ళ్లు బ్లింక్ చేస్తే ఎమోష‌న్ డ్రాప్ అవుతుంద‌ని .. మ‌ళ్లీ ఆ ఎమోష‌న్ ని తిరిగి తేవాలంటే చాలా కష్టమ‌ని.. అలా డిస్ట్రాక్ట్ అవ్వ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని సెల్వ రాఘ‌వ‌న్ గురించి డీటెయిలింగ్ ఇచ్చారు. బాలా స‌ర్ కి లిప్ సింక్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటారు. లిప్ మూవ్ మెంట్ ఫీల్ గురించి ఆలోచిస్తారు. ఆర్టిస్టులో ఫీల్ ని తేవ‌డానికి అది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చెబుతారు. పెద‌వుల్ని ఓపెన్ గా ఉంచ‌డం వ‌ల్ల సీన్ ఎలైవ్ గా ఉంటుంద‌ని అంటారు. లిప్స్ మూయొద్ద‌ని చెబుతారు. సెల్వ స‌ర్ అయితే అలా కాదు. లిప్స్ తో ప‌నేం లేదు .. మూసేసి ఉంచాల‌ని అంటారు. ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో ర‌కం న‌మ్మ‌కం ఉంటుంది. ఒక్కొక్క‌రి కి ఒక్కో యూనిక్ స్టైల్ ఉంటుంది. అంద‌రికీ అన్ని రాకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒకే రూట్ లో ఉంటే అంద‌రికీ న‌చ్చుతుంది అని చెప్ప‌లేం. ఎవ‌రి మార్గం వారిది.. అని తెలిపారు.

నా ప‌ని ఏంటి?  సెట్స్ కి వెళ్ల‌డం.. ద‌ర్శ‌కుల‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అవ్వ‌డం.. వాళ్లు చెప్పిన‌ట్టు చేసి ప్రాణం పెట్టి ప‌ని చేయ‌డం నా పని. అప్పుడే ఒక న‌టుడు విజ‌య‌వంతం కాగ‌ల‌రు. వాళ్లు అన్నివిధాలా చెప్పిన‌ప్పుడు ఇలా చేయ‌ను అలా చేయ‌ను అన‌కూడ‌దు. ఎటాక్ మోడ్ తో ఉండి చెప్పింది కరెక్టుగా చేయాలి... అని సూర్య త‌న వ‌ర్కింగ్ స్టైల్ గురించి చెప్పారు. సూర్య తాజా చిత్రం ఎన్జీకేతో తిరిగి పూర్తి యాక్ష‌న్ మోడ్ లోకి వ‌చ్చేస్తున్నాన‌ని కాన్ఫిడెన్స్ ని క‌న‌బ‌రిచారు.

    

Tags:    

Similar News