పిక్ టాక్ : అక్కినేని హీరో లుక్ మార్చాడు

Update: 2022-12-15 02:30 GMT
అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ఆయన కెరీర్‌ ఆరంభం అయ్యి దశాబ్ద కాలం అయినా కూడా పాపం కమర్షియల్ గా బ్రేక్ దక్కలేదు. అయినా కూడా సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సుశాంత్‌ నటిస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో వరుసగా ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్తున్న సుశాంత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో భాగంగా ఇలా లుక్ మార్చి ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా సుశాంత్ న్యూ లుక్ ను చూసి అక్కినేని ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత బాగున్నా కూడా పాపం సుషాంత్ కు హీరోగా సక్సెస్ లు ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

రవితేజ హీరోగా నటిస్తున్న రావణసుర సినిమాలో సుశాంత్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఆయన ఈ సినిమా తో మరోసారి తన సత్తా చాటడం ఖాయం అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రావణసుర తర్వాత హీరోగా మళ్లీ సుశాంత్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News