ఉదయ్‌ కిరణ్ మళ్ళీ అరెస్టయ్యాడు

Update: 2016-03-25 04:18 GMT
హీరోగా పరిచయం కాగానే కొందరికి కళ్లు నెత్తిమీదకు వచ్చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇమేజ్ సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో పోరాడుతూనే.. మందు మత్తులో మునిగి తేలుతున్నారు. కాసింత గుర్తింపు రాగానే తాము పెద్ద సెలబ్రిటీల కింద ఫీలవుతున్నారనే ఆరోపణలను తాజాగా ఓ హీరో నిజం చేసేశాడని తెలుస్తోంది.

'ఫేస్ బుక్' మూవీలో నటించిన నండూరి ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీ దసపల్లా హోటల్ లో హల్ చల్ చేశాడు. పూటుగా లిక్కర్ తాగేసిన ఈ కొత్త హీరో అక్కడ సిబ్బందిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. హోటల్ అద్దాలు బద్దలు కొట్టడమే కాకుండా.. కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ముందు కాసేపు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన హోటల్ యాజమాన్యం.. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది.

హోటల్ సిబ్బంది ఇచ్చిన కంప్లెయింట్ తో ఉదయ్ కిరణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గతంలో ఈ కుర్ర హీరో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. అయితే.. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ ఖండించాడు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, ఈ ఆరోపణలు నిజం కాదని అంటున్నాడు. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు విచారణ జరపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News