తెలుగు సినీపరిశ్రమకు మింగుడుపడని కొన్ని వ్యవహారాలకు ఇప్పట్లో పరిష్కారం దొరికే మార్గం లేదని ఆవేదన కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో టిక్కెట్లు ధరల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఆయన ఒక మెట్టు దిగి వచ్చి టాలీవుడ్ పెద్దలతో మంతనాలు సాగించేందుకు అన్నా అని పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవికి కబురు పంపారు. సినీపెద్దలు వచ్చి కలిసి తమ సమస్యలేమిటో విన్నవించాల్సిందిగా మంత్రి పేర్ని నాని ద్వారా ఆహ్వానం పంపారు.
ఆ తర్వాత మంత్రివర్యులు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంట సత్కారం పొందారు. అనంతరం రకరకాల భేటీల్లో తెలుగు సినీపరిశ్రమలో ఉన్న అవ్యవస్థపైనా మెగాస్టార్ రివ్యూలు చేసి తొలుత ఇంటిని శుభ్రపరుచుకోవాల్సిందిగా కోరారు.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే .. మెగాస్టార్ చిరంజీవి సహా సినీపెద్దలు సీఎంతో భేటీకి సంబంధించిన తదుపరి కాల్ ఇంతవరకూ లేకపోవడంపై చర్చ సాగుతోంది. సీఎం జగన్ రకరకాల బిజీ షెడ్యూల్స్ లో ఉండడం వల్ల సినీపెద్దలకు సమయం కేటాయించలేకపోతున్నారని టాక్ వినిపించింది. ఈ సెప్టెంబర్ తొలి వారంలోనే సినీపెద్దలతో జగన్ భేటీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే జగన్ తో సమావేశానికి వెళ్లేది ఎంతమంది? ఎవరెవరు వెళతారు? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం నలుగురు పెద్ద మనుషులు వచ్చి సమస్యను విన్నవించాల్సిందిగా సీఎం కోరారట. ఒకవేళ నలుగురే వెళ్లాల్సి వస్తే అందులో చిరంజీవి తో పాటు ఒక నిర్మాత ఒక ఎగ్జిబిటర్ కి అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా పెద్ద హీరోకి ఛాయిస్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ లో మహేష్ - అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఆసక్తిని కనబరిచారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
టిక్కెట్ రేట్ క్రైసిస్ అనేది చాలా పెద్ద సమస్య. దానివల్ల ఇండస్ట్రీకే కాదు హీరోలకు పెను సమస్యలున్నాయి. స్టార్ల పారితోషికాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు ట్రేడ్ విశ్లేషకుల రివ్యూల అనంతరమే జగన్ టిక్కెట్టు రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. అది అనాలోచిత నిర్ణయం కాదని కూడా పలువురు ఎగ్జిబిషన్ రంగ నిపుణులు.. సీనియర్ నిర్మాతలు విశ్లేషించారు.
ఇకపోతే సీఎం జగన్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండడానికి కారణమేమిటి? అంటూ ఇటీవల ఆరాలు కొనసాగుతున్నాయి. నిజానికి సీఎం తో సాన్నిహిత్యం కోసం టాలీవుడ్ పెద్దలెవరూ సరిగా ప్రయత్నించకపోవడమే ప్రధాన కారణమని.. జగన్ కి పరిశ్రమ వ్యతిరేకం అనే సంకేతం వెళ్లడమే ఇన్ని పరిణామాలకు కారణమని కూడా విశ్లేషిస్తున్నారు. నిజానికి జగన్ పరిశ్రమకు వ్యతిరేకం కాదు.. తనకు వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకులు.. పరిశ్రమ అభివృద్ధికి ఆయన కృషి చేసేందుకు అన్నివేళలా ఆసక్తిగా ఉన్నా సినీపెద్దల నుంచే సరైన సమయంలో సరైన స్పందన లేదని కూడా కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు.
అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ కి వైజాగ్ టాలీవుడ్ ఆవశ్యకతపైనా సీఎం జగన్ ఎంతో ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. వినోదపరిశ్రమతో పాటు కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ నగరంలో ఐటీ పరిశ్రమ-టూరిజం - పరిశ్రమల అభివృద్ధి- అంతర్జాతీయ ఎయిర్ పోర్టు- కార్గో విస్తరణ- రహదారుల కోసం జీవీఎంసీ నుంచి భారీగా డీపీఆర్ లను ప్రిపేర్ చేశారు. సినీపెద్దలు చిరంజీవి సారథ్యంలో వైజాగ్ టాలీవుడ్ ప్రపోజల్ పై సీఎం జగన్ పాజిటివ్ గా స్పందించారు. ఈసారి భేటీలో పరిశ్రమ ఎగ్జిబిషన్ రంగం పంపిణీ నిర్మాణం అంశాలు సహా.. వైజాగ్ టాలీవడ్ అంశం కూడా చర్చకు వచ్చేందుకు ఆస్కారం లేకపోలేదని చెబుతున్నారు.