ఎక్స్ క్లూసివ్:దర్శకుడు పై ఫైర్ అవుతున్న హీరోయిన్

Update: 2017-08-02 05:46 GMT
ఆ దర్శకుడు తీసిన సినిమాల్లో హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి. అగ్ర హీరోలకి కూడా డిజాస్టర్లు ఇచ్చిన ఆ దర్శకుడు - అడపదడప సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే ఈ విషయంలో కూడా ఆ దర్శకుడు ట్రాక్ తప్పాడనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే నిర్మాతగా మారిన మొదటి సినిమాని విడుదల చేసేందుకు ఆ దర్శకుడు చాలా కష్టపడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు సంవత్సరానికి పైగా సినిమాని రిలీజ్ చేయకుండా హోల్డ్ లో ఉంచిన ఆ దర్శకుడు, ఆ సమయంలో తన సినిమాకి నటించిన హీరోయిన్ కి పెమెంట్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టాడట.

అయితే రిలీజైన తరువాత సినిమా హిట్ అవ్వడంతో ఆ హీరోయిన్ కి కష్టాలు తీరాయి. అంతవరకు బాగానే ఉంది, అయితే ఇప్పుడు మరో సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నాడు ఆ దర్శకుడు, అయితే ఈ సినిమా విషయంలో కూడా గతాన్నే రిపీట్ చేస్తున్నాడట ఆ ఫిల్మ్ మేకర్. దాదాపు సంవత్సన్నర నుంచి ఈ కొత్త ప్రాజెక్ట్ లో నటించిన హీరోయిన్ కి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా సినిమాని రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ, చివరకు రిలీజ్ చేస్తున్నాడట. దీంతో ఏం చేయాలో తెలియని ఆయోమయ స్థితిలో ఆ దర్శకుడు బారిన పడ్డ హీరోయిన్ ఉందని సమాచరం. ఇది ఇలా ఉంటే తాజాగా ఆ దర్శకుడు నుంచి రాబోతున్న సినిమా పలు మార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సినిమా కంటెంట్ ఆశించనంత స్థాయిలో రాకపోవడంతో బిజినెస్ వర్గాలు ఆ ప్రాజెక్ట్ పై అంతగా ఆసక్తి చూపలేదని అందుకే ఆ సినిమా వాయిదాలు మీద వాయిదాలు పడిందని తెలిసింది. మరి సినిమా రిలీజ్ లేట్ చేస్తున్న, హీరోయిన్ కోపానికి కారణం అయిన ఆ దర్శకుడు మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News