చిక్కుల్లో హీరోయిన్.. అధికారులకు ఫిర్యాదు

Update: 2019-10-04 06:21 GMT
అచ్చ తెలుగు నటి - హీరోయిన్ అయిన అంజలి అంటే తెలియని తమిళ - తెలుగు జనాలు ఉండరు.. తమిళంలో ఎంట్రీ ఇచ్చినా తెలుగులోనూ అగ్రహీరోలతో నటించి పేరు పొందారు. అంతటి పాపులారిటీ గల హీరోయిన్ చేసిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చింది. ఒక వంటనూనె కంపెనీకి అంజలి ప్రచారం చేయడం.. అది చట్టనిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో చిక్కుల్లో పడింది..

హీరోయిన్ అంజలి ప్రచారం చేసిన వంట నూనె నిబంధనలు పాటించడం లేదని.. ఆమె ప్రచారం వల్ల జనాలు కొని అనారోగ్యం పాలవుతున్నారని తాజాగా తమిళనాడులోని కోవై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందింది. నటి అంజలిపై చర్యలు తీసుకోవాలని కోవై సుడర్ పార్వే మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం ఫిర్యాదు చేశారు.

ఈ-రోడ్డు ప్రధానకార్యాలయంగా ఉన్న ఈ వంటనూనె క్వాలిటీపై పరిశోధనకు పంపామని.. అదీ నిబంధనలు పాటించడం లేదని తేలిందని సత్యగాంధీ తెలిపారు. ఈ వంటనూనె హానికరంగా తేలిందన్నారు. దీనిని స్వాధీనం చేసుకొని తయారీ దారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాణిజ్య ప్రకటనల్లో నటించిన అంజలి కూడా ప్రజలను మోసపుచ్చే ప్రకటనలు చేసిందని.. ఆమెపై కేసు నమోదు చేసి విచారలని ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారి చర్యలకు ఉపక్రమించాడు. దీంతో హీరోయిన్ అంజలి చిక్కుల్లో పడ్డారు.
Tags:    

Similar News