హైబ్రిడ్ పిల్లను గుర్తుపట్టని వరంగల్ వాసులు!

Update: 2019-09-07 10:41 GMT
హీరో హీరోయిన్లకు సాధారణ జనాల్లో చాలా క్రేజ్ ఉంటుంది. బయట కనిపిస్తే చాలు చుట్టూ చేరతారు.. సెల్ఫీలు అడుగుతారు.  'ఫిదా' లో భానుమతి పాత్రతో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టకుండా ఉండడం అనేది ఊహించలేం.  రీసెంట్ గా అలానే జరిగింది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకేక్కుతున్న 'విరాట పర్వం' చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈమధ్య వరంగల్ లోని పర్కల్ బస్ స్టాండ్ లో జరిగింది.  అయితే షూటింగ్ జరుగుతోందనే  విషయం అందరికీ చెప్పకుండా కెమెరాను బస్టాండ్ కు ఎదురుగా ఉండే బిల్డింగ్ లో సీక్రెట్ గా పెట్టారట.  సాయి పల్లవి ఒక సాధారణ ప్రయాణీకురాలి తరహాలో దుస్తులు ధరించి.. బస్టాండ్ లో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంది.  బస్ కోసం వెయిట్ చేసింది.  ఒక బస్ రాగానే మిగతా ప్రయాణీకుల లాగా బస్ ఎక్కింది. ఈ సీన్ అంతా కెమెరాలో చిత్రీకరించారు కానీ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రయాణీకులు ఎవరూ సాయి పల్లవిని గుర్తించలేదట.  

కానీ సాయి పల్లవిని గుర్తు పట్టిన ఒక వ్యక్తి మాత్రం తన మొబైల్ ఫోన్ లో వీడియో తీయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  ఈ సంఘటన ద్వారా మనకు అర్థం అయ్యే విషయం ఏంటంటే సాయి పల్లవి ఒక గెటప్ వేసుకుంటే ఇక ఎవరూ గుర్తు పట్టలేరని.   జ్యోతిక పూర్తిగా 'చంద్రముఖి'గా మారినట్టు సాయి పల్లవి పూర్తిగా సాధారణ ప్రయాణీకురాలి పాత్రలో లీనమైపోయింది కాబట్టే అక్కడ ఉన్న ఇతరులు గుర్తించి ఉండరు.  'విరాట పర్వం' చిత్రంలో రానా దగ్గుబాటికి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.

    
వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News