ఈ మధ్య ప్రతీ ఈవెంట్లకు సినిమా తారలను - స్టార్ హీరోయిన్లను - సెలబ్రిటీలను పిలవడం బాగా కామన్ అయిపోయింది. ఇక్కడే కాదు.. విదేశాల్లో ఈవెంట్ల కోసం కూడా తెగ పిలిపించేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు జనాలు జరుపుకునే ఈవెంట్లలో అయితే, ముగ్గురు నలుగురు కూడా సందడి చేస్తున్న సందర్భాలున్నాయి. ఇలా తమకు డిమాండ్ పెరగడంతో.. తమ డిమాండ్ల చిట్టాను పెంచేస్తున్నారు నటీమణులు.
ఇలా ఓ ఈవెంట్ కి ఇన్వైట్ చేయడమంటే.. ఇక్కడ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి, మళ్లీ ఇక్కడ దిగే వరకూ ప్రతీ పెన్నీని ఖర్చు చేసేందుకు సిద్ధమవాల్సిందే. కానీ ఇలా వచ్చేందుకు ఏకంగా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ కావాలంటూ కండిషన్లు పెరుగుతున్నాయట. ఓ ఎకానమీ టికెట్ కి ఆరు రెట్లు, బిజినెస్ క్లాస్ కి 3 రెట్లు ఉంటుంది ఫస్ట్ క్లాస్ టికెట్. మొదట కొత్త ఉత్సాహంతో ఎకానమీలో వచ్చినా.. ఆ తర్వాత బిజినెస్ క్లాస్ కావాలని కోరుతున్నారట.
ఇలా రెండు సార్లు ముచ్చట తీరిపోయాక.. బిజినెస్ క్లాస్ లోనూ ప్రైవసీ ఉండడం లేదని, ఫస్ట్ క్లాస్ టికెట్స్ బుక్ చేస్తేనే వస్తామని హీరోయిన్లు ఆంక్షలు విధిస్తుండడంతో.. ఖర్చు తడిసిమోపెడవుతోందని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. అయితే.. ఇక్కడ ప్రైవసీ కంటే.. ఈ హైఎండ్ ఫ్లయింగ్ ఎక్స్ పీరియన్స్ ని అవతలి వాళ్ల ఖర్చుతో ఎంజాయ్ చేసేందుకే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!