అమ్మళ్లందరూ ఇలా హ్యాండిస్తున్నారేంటి?

Update: 2015-12-04 04:51 GMT
ఒక్కోసారి అంతే.. మాంచి మాంచి హీరోయిన్లందరూ హ్యాండిస్తుంటారు. మన మార్కెట్‌ఎలా ఉందన్న విషయం బట్టి వారు స్టెప్పులు వేస్తుంటారు. ప్రస్తుతం యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ విషయంలో అదే తరహాలో జరిగిందా అంటే అవుననే చెప్పాలి.

మహేష్‌ తో మురుగుదాస్‌ సినిమా సెట్టవుతుందేమోనని.. నేరమ్‌ సినిమా రీమేక్‌ లో సందీప్‌ తో నటించడానికి నో చెప్పింది హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక కొత్త విషయం తెలుస్తోంది. సందీప్‌ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమాలో మరో హీరోయిన్‌ కావల్సి ఉంది. ఆల్రెడీ నిత్య మీనన్‌ ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ గా చేస్తోంది. ఇంకో ప్రతే్యక పాత్రలో నటించడానికి మరొక హీరోయిన్‌ గా లావణ్య త్రిపాఠిని చేయమని అడిగారట. కాని అమ్మడు మాత్రం డేట్లు ఖాళీ లేవు అంటూ హ్యాండిచ్చేసింది.  అసలు అమ్మడు డేట్లు ఏమయ్యాయ్‌ అని చూస్తే.. చేతిలో ఉన్న సోగ్గాడే చిన్ననాయనా, అల్లు శిరీష్‌ సినిమా.. ఆల్రెడీ పూర్తయిపోయాయ్‌. మిగిలిన కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయంటే.. అవి ఇంకా షూటింగ్‌ దశలోకి రానేలేదు. సో.. అమ్మడి డేట్లు ఖాళీగా లేకుండా ఎక్కడికి పోయాయ్‌?

చూస్తుంటే.. అసలే వరుసగా ఫ్లాపులు కొడుతున్న సందీప్‌ కిషన్‌తో ఇప్పుడు సినిమా చేస్తే.. తమ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యి పెద్ద హీరోలు తీసుకోరు అనుకుంటున్నారా ఏంటి ఈ భామలందరూ.. ఏమో.. అయ్యే ఉండొచ్చు!!
Tags:    

Similar News