ఈ హీరోయిన్లు.. రియల్ హీరోలు

Update: 2016-02-18 17:30 GMT
ఇతరుల మాటలు వినే కంటే.. చాలాసార్లు మనల్ని మనమే నమ్ముకోవడమే మంచి ఫలితాలు ఇస్తుంది. మనలోని అంతర్గత శక్తి మనకు మాత్రమే తెలుసు కాబట్టి.. ఇష్టాలు, భవిష్యత్తు వంటి విషయాల్లో ఇతరుల మాటను ఖాతరు చేయకూడదంటున్నారు కొందరు సెలబ్రిటీలు.

శ్రియకు హీరోయిన్ గా ఎంత పేరుందో.. మంచి డ్యాన్సర్ గానూ అంతకంటే గుర్తింపు ఉంది. ఆమెకు నాట్యంపై మక్కువ చాలా ఎక్కువ. ఈ ఇష్టం చిన్నప్పటి నుంచి ఉన్నా.. స్కూల్ రోజుల్లో ఎప్పుడూ ఆమెను డ్యాన్స్ ప్రదర్శనలకు కూడా సెలెక్ట్ చేయలేదట. తర్వాత పార్టిసిపేట్ చేసిన పోటీల్లో కూడా కనీసం టాప్ త్రీలో కూడా నిలవలేకపోయిందట. అందరూ నీకు డ్యాన్స్ అచ్చిరాదని చెప్పినా.. తనపై తను నమ్మకంతో.. ఇప్పుడీ స్థాయికి చేరుకున్నా అంటోంది శ్రియ.

9 ఏళ్ల వయసులోనే 55 కిలోల బరువు ఉండేదట ముమైత్ ఖాన్. అందరూ బండగా ఉన్నావని, చూడ్డానికి కూడా బాలేదని వెక్కిరించేవారట. నెలలు నిండకుండానే పుట్టడంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవట ముమైత్ కి. సొంత బంధువులే హేళన చేసే పరిస్థితితోపాటుచాలా కష్టాలు పడుతున్న సమయంలో.. డ్యాన్స్ నేర్చుకుని, అందులోనే టైం గడిపేసేదట ఈమె. అలా నేర్చకున్న ఆ డ్యాన్స్.. ఇప్పుడామె జీవితాన్ని ఎన్నో మెట్లు ఎక్కించింది.  

ఇక మహేష్ తో కనిపించిన కృతి సనోన్ కూడా ఒత్తిడిని జయించే విజయాలు సాధించింది. నువ్వు ఇంజనీర్ కాలేవు, ఎందుకంటే ప్రెజర్ ని తట్టుకోలేవని అమ్మ అనడంతో.. పట్టుదలగా చదివి ఇంజినీరింగ్ ఎగ్జామ్ లో టాప్ లో నిలవడమే కాకుండా.. ప్రీమియర్ కాలేజ్ లో సీట్ కూడా సంపాదించిందట. హీరోయిన్ అవడంలో కూడా మొదటి ఫోటో షూట్ ఫెయిల్ అయినపుడు కన్నీళ్లు పెట్టుకోవడం, ర్యాంప్ వాక్ చేస్తూ పడిపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కున్నా.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
Tags:    

Similar News