మనకిప్పుడు పండుగ సీజన్ నడుస్తోంది. ఉగాది వరకూ వరుసగా పండుగలతో ఫుల్లు హడావిడి ఉంటుంది. ఇదే పరిస్థితి సినీ పరిశ్రమకి కూడా. టాలీవుడ్ లో అవార్డ్ సీజన్ నడుస్తోందిపుడు. రీసెంట్ గా ఫిలింఫేర్ అవార్డులు - ఐఫా అవార్డుల వేడుకలు పూర్తయ్యాయి. అయితే, ఇది ప్రారంభమే.. ఇంకా చాలానే పండుగలు ముందున్నాయి. అన్ని చోట్లా అందమైన భామలతో అందాల విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైద్రాబాద్ లో ఐఫా అవార్డులతో పాటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇది ఫైనల్స్ స్టేజ్ కి వచ్చిందంటే.. అన్ని ఇండస్ట్రీల హీరోలు - వయ్యారి భామలు ఒకచోటకి చేరతారు. ఆ తర్వాత గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్(గామా) దుబాయ్ లో జరుగనున్నాయి. సంగీతం అవార్డులే అయినా.. స్పెషల్ గెస్టులు సుందరాంగులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత నార్త్ అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్(నాటా) వేడుకలకు రంగం సిద్ధమవుతుంది.
నాటా అవార్డుల ఫంక్షన్ లో అమెరికాలో జరుగుతుంది. దుబాయ్ - అమెరికాల్లో జరిగే వేడుకల్లో పాలు పంచుకున్నందుకు, ప్రదర్శనలు చేసినందుకు భారీగా సొమ్ములు కూడా ముడతాయి. అందుకే ఇప్పటికే చాలామంది విదేశాల్లో ప్రోగ్రాముల కోసం తట్టాబుట్టా సర్దేస్తున్నారు. అంటే.. షాపింగ్ - ఫ్యాషన్ అంటూ ప్రిపేర్ అయిపోతున్నారు. ఫంక్షన్ ఏదైనా సరే.. వయ్యరాల విందు మాత్రం పక్కా.