చాలా రోజుల తర్వాత క్రేజీ కాంబోలో రూపొందనున్న నాగార్జున నానిల మల్టీ స్టారర్ కోసం పెద్ద కసరత్తే జరుగుతోంది. షూటింగ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చూసుకోవడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బిజీగా ఉన్నాడు. కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్న ఇతను ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. టేకింగ్ పరంగా తన టాలెంట్ ను భలే మంచి రోజులో చూపించిన శ్రీరామ్ ఆదిత్య రెండో సినిమా శమంతకమణిలో నలుగురు యూత్ హీరోలు ఉన్నా పూర్తి స్థాయిలో గొప్ప విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే ఇప్పడు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ దీన్ని తెరకిక్కించబోతున్నట్టు టాక్.
ఇదిలా ఉంటే హీరొయిన్ల ఎంపిక పెద్ద ఛాలెంజ్ గా మారింది శ్రీరామ్ కు. నాగ్ - నాని లకు చెరొక హీరొయిన్ కావాలి. వయసు రిత్యా ఇద్దరికీ గ్యాప్ ఉన్నప్పటికీ సబ్జెక్టు పరంగా అది మరీ ఎక్కువ అనిపించని పాత్రలు శ్రీరామ్ డిజైన్ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపధ్యంలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యం అనిపించేలా హీరొయిన్లను సెట్ చేయటం కత్తి మీద సామే. ఓ ఇద్దరు ముగ్గురితో చర్చలు జరిగాయట కాని పారితోషికం వద్ద ఏకాభిప్రాయం రాలేదని సమాచారం. మరి చివరికి ఎవరు సెట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. నాగార్జునది నానితో సమానంగా జర్నీ చేసే పాత్ర కావడం వల్ల హీరొయిన్లకు మరీ ఎక్కువ స్పేస్ దొరక్కపోవచ్చు అనే టాక్ ఉంది.
నాగార్జున మల్టీ స్టారర్ చేసి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో మంచు విష్ణుతో కృష్ణార్జున చేసాక మళ్ళి యూత్ హీరోతో కలిసి నటించలేదు. పాత్ర బాగుంటే క్యామియోకు కూడా వెనుకాడని నాగ్ ఈ కథ బాగా నచ్చడం వల్లే ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు టాక్. ఉగాది పండగ సందర్భంగా షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ మూవీకి భారీ సినిమాల నిర్మాత అశ్వినిదత్ నిర్మాణ సారధి కావడం పెద్ద ప్లస్.