ప్రముఖ సంగీత దర్శకుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహ్మాన్ కు కోర్టు నోటీసులు అందాయి. పన్ను ఎగవేత విషయమై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా రహ్మాన్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇన్ కం ట్యాక్స్ అధికారులు 2012 కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఒక లావా దేవీ విషయమై చెల్లించాల్సిన ట్యాక్స్ ను రహ్మాన్ చెల్లించలేదు అంటూ అధికారులు కోర్టులో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 2012 సంవత్సరంలో బ్రిటన్ కు చెందిన ఒక సంస్థతో రహ్మాన్ 3.47 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం అప్పట్లోనే రహ్మాన్ ఖాతాలోకి వచ్చాయి. కాని అందుకు సంబంధించిన ఆయన చెల్లించాల్సిన ట్యాక్స్ విషయంలో మాత్రం ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే పలు సార్లు ఆయనకు నోటీసులు పంపినా కూడా స్పందించక పోవడంతో ఇప్పుడు హై కోర్టును ఆశ్రయించినట్లుగా ఇన్ కం ట్యాక్స్ అధికారులు పేర్కొన్నారు. ప్రముఖులు ఇలా ట్యాక్స్ ఎగవేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ కొందరు రహ్మాన్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఉంటే వందల కోట్లు దండుకు పోయిన వారిని ఏం చేయలేరు కాని ఒక సామాన్యమైన సినిమా వాళ్లపై మాత్రం మీ ప్రతాపం చూపిస్తారా అంటూ ఐటీ అధికారులపై నెటిజన్స్ రుసరుసలాడుతున్నారు.