బుల్లితెరపై `బిగ్ బాస్ 3` సిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఇంట్లో పదిహేను మంది ఎమోషన్స్ ని కెమెరాల్లో క్యాప్చుర్ చేయడం ఆసక్తికరమైన టాస్క్ అనుకుంటే.. అందులోనే ఏడుపులు పెడబొబ్బలు గొడవలు గోతులు తవ్వుకోవడాలు వగైరా వగైరా వినోదం అబ్బో! చెప్పుకుంటే చాలా ఉంది.
ప్రస్తుతం `బిగ్ బాస్ 3` తెలుగు వినోదం పీక్స్ కి చేరుకుంది. ఒకరకంగా పరాకాష్టకు చేరుకుందనే చెప్పాలి. ఇన్నాళ్లు తెలుగు సినిమా ఎన్ని రసాల్ని అందించిన ఒక్క `రసం` మాత్రం మిస్సయ్యింది. అదే జుగుప్స రసం. ఆ రసాన్ని బాగా పిండి తెలుగు ప్రేక్షకుల్ని గొప్పగా ఎమోషన్ కి గురి చేసేలా చేయడంలో హిజ్రా తమన్నా తాను అనుకున్నది సాధించింది.
ఇక నిన్న టాస్క్ లో నటి కం యాంకర్ హిమజ- నటుడు అలీల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇంట్లో నీళ్లు తాగినందుకు హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేశాడు. నిరాకరణ ఫర్వంతో నేరుగా జేబులో చేయి పెట్టి డబ్బు లాక్కుంటున్న సన్నివేశంలో అతడి ముఖంపై ఫెడీల్మని కాలితో ఓ తన్ను తన్నింది హిమజ. మేల్ డామినేటెడ్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ వెంటనే బయటపడింది. నన్నే తన్నుతావా? అంటూ కొట్టేందుకు వెళ్లి అలీ రక్తి కట్టించారు. నువ్వు చేతులు పెట్టావ్ కాబట్టే తన్నాను కావాలని కాదులే! అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది హిమజ.
డబ్బు వసూలవ్వాలి కాబట్టే తీసుకోవడానికి ట్రై చేశానంటూ అలీ అరుపులు కేకలతోనే నానా యాగీ చేశాడు. అంత మాత్రాన తంతావా? అంటూ ఎమోషన్ ని పీక్స్ తీసుకెళ్లేవాడు. హిమజ పెర్శనల్ లైఫ్ గురించి మాట్లాడడంతో ఆమె హర్ట్ అయి కావాలని తన్నలేదని చివరికి అతడి కాళ్లపై పడి క్షమాపణ కోరింది. అంతేనా బోరు బోరుమంటూ ఏడ్చేసింది. ఆ ఏడుపు తట్టుకోలేని తమన్నా తెగ ఓదార్చేస్తూ సదరు అలీ పై మండి పడి ఆడపిల్ల కాళ్లు పట్టుకున్నా రెచ్చిపోతున్నావ్! అంటూ అతడిపై ఎటాక్ కి దిగడంతో రచ్చ రచ్చయ్యింది. అబ్బో.. అబ్బబ్బ.. తెగ రక్తి కట్టించారు పో!!