తెలిసింది ఎంతో గాని కొంతమంది చెప్పే స్టోరీలు సొల్లు కంటే దారుణంగా ఉంటాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా చిరాకు తెచ్చే గొప్పలు చెప్పుకుంటారు. మార్చ్ లో పరీక్షలు అయిపోయిన తర్వాత మన కార్పొరేట్ విద్య సంస్థలు ఏ స్థాయిలో డబ్బా కొట్టుకుంటాయో అంతకంటే దారుణంగా బిగ్ బాస్ లో ఒక భామ మనకు తెలియని అబద్దపు చరిత్రని నార్త్ జనాలకు నిజాలనెలా చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీలు కూడా ఉన్నాయా అని ఇప్పుడు బాలివుడ్ మీడియాలు గుడ్డిగా నమ్మేసి కోడై కూస్తున్నాయి.
దేశంలో అత్యంత భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకున్న బిగ్ బాస్ షో గత పదేళ్లుగా బాలీవుడ్లో సక్సెస్ రేటింగ్ తో నటిస్తూ వస్తోంది. కానీ 11వ సీజన్ కి మాత్రం సాధారణ సీరియల్ కి వచ్చిన TRP కూడా రావడం లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ చేసే ఓవర్ యాక్షన్ ని నార్త్ జనాలకు ఏ మాత్రం నచ్చడం లేదు. దీంతో షోకి హైప్ తేవాలని సౌత్ ఇండుస్ట్రీలపై పై పడ్డారు. తెలిసి తెలియని విషయాలకు కాస్త మసాలా మాటలను తగిలించి హీనా ఖాన్ అనే కంటెస్టెంట్ తెలుగు జనాలు నవ్వుకునేలా కామెంట్ చేసింది. ఓ రకంగా ఆగ్రహం కూడా తప్పించింది. అమ్మడికి తెలుగులో మహేష్ - వెంకటేష్ నటించిన (సీతమ్మ వాకిట్లో సిరిమాల్లో చెట్టు) సినిమాలో ఫీమేల్ మేయిన్ లీడ్ లో ముందు తననే ఎంచుకున్నారని చెప్పింది. కానీ అమ్మడే ఒప్పుకోలేదట.
అది పక్కన పెడితే టాలీవుడ్ లో మహేష్ - వెంకటేష్ అభిమానులు చాలా కొట్టుకుంటారని చెప్పింది. అంతే కాకుండా ఒకరి అభిమానులంటే మరొకరికి చాలా కోపమని వారికి అస్సలు పడదని కాస్త ఘాటుగానే నమ్మేట్టు చెప్పింది. దీంతో కొందరు తెలుగు ఆడియెన్స్ అది విని నవ్వుకుంటున్నారు. ఇక మన సెలబ్రెటీల అందాల గురించి కూడా కామెంట్స్ చేసింది. అయితే టాలీవుడ్ వారు ఈ విషయంపై స్పందించడం లేదు. అందుకు కూడా ఒక కారణం ఉందని చెప్పవచ్చు. అసలు హీనా ఖాన్ లాంటి బుల్లితెర నటి మాటలను పట్టించుకోని ఆమెపై కామెంట్ చేస్తే అనవరంగా ఆమెకు ప్రచారం చేసినట్టు అవుతుంది. పైగా మన స్టార్స్ వాల్యూ కూడా తగ్గచ్చు. అందుకే మనవాళ్లు పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు.