అడవి శేష్ నటించిన హిట్ 2 సెకండ్ కేసు సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్లో నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వారు ఎంతో నమ్మకంగా కనిపించారు.
ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. హిట్టు సెకండ్ కేసు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అని వివరాల్లోకి వెళితే. నైజాం లో 4 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 1.75 కోట్లు ఆంధ్ర మొత్తంలో కూడా 4.5 కోట్ల వరకు అమ్ముడయినట్లు సమాచారం.
ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే 10.25 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా కలుపుకొని 1.50 కోట్ల వరకు హిట్ 2 సినిమా అమ్ముడైనట్లు సమాచారం.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 14.25 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రంగంలోకి దిగుతుంది. ఇక అడవి శేష్ గత సినిమాలో బిజినెస్ లు బట్టి చూస్తే ఈ సినిమా టార్గెట్ మాత్రం కాస్త పెద్దదే.
అడివి నటించిన గత మూడు సినిమాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగులో మేజర్ సినిమా 13 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక అంతకు ముందు వచ్చిన ఎవరు సినిమా 10 కోట్ల వరకు బిజినెస్ చేయగా.. గూఢచారి సినిమా 5 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
తెలుగులో అయితే ఈ మూడు సినిమాలు కూడా టార్గెట్ ను చాలా తొందరగానే ఫినిష్ చేశాయి. అంతేకాకుండా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మంచి ప్రాఫిట్స్ అందించాయి. మరి ఈసారి హిట్ 2 సినిమా ఎంత మేరకు ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.