విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హిట్ సినిమాకు ప్రస్తుతం రెండవ పార్ట్ రూపొందుతున్న విషయం తెల్సిందే. హిట్ ఫ్రాంచైజీ లో వరుసగా సినిమాలు రాబోతున్నట్లుగా నిర్మాత నాని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం హిట్ 2 రూపొందుతోంది. అందులో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.
హిట్ 2 లో ఎందుకు విశ్వక్ సేన్ నటించడం లేదు అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. ఆ విషయమై తాజాగా విశ్వక్ సేన్ స్పందించాడు. హిట్ ను వరుసగా తీయాలని అనుకున్నారు. అయితే ప్రతి పార్ట్ ను కూడా వేరు వేరు హీరోలతో తీయాలని మొదటే భావించారు.
ఈ రెండవ పార్ట్ ను నాని అన్న చేయాలని అనుకున్నాడు. కానీ ఆయన డేట్లు సర్దుబాటు అవ్వక పోవడం వల్ల తన వల్ల టీమ్ అంతా అలా ఉండి పోవడం ఎందుకు అని అడవి శేష్ తో చేయిస్తున్నాడు అంటూ విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.
హిట్ ఫ్రాంచైజీ లో నాలుగు పార్ట్ లు పూర్తి అయిన తర్వాత అయిదవ పార్ట్ లో నాలుగు పార్ట్ ల హీరోలు కలిసి నటించాలని ప్లాన్ చేశారని.. అందుకు సంబంధించిన విధంగా సినిమా లు రూపొందబోతున్నాయి అన్నట్లుగా విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. అదే కనుక జరిగితే అది పెద్ద సర్ ప్రైజింగ్ మల్టీ స్టారర్ గా ఆ సినిమా నిలుస్తుందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.