విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదలకు సిద్దం అయ్యి ఆగిపోయింది. థియేటర్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే అప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్న ఈ సినిమా టీజర్ ను దీపావళి సందర్బంగా విజయ్ అభిమానుల ఒత్తిడి మేరకు విడుదల చేయడం జరిగింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెన్షేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు.
మాస్టర్ సినిమా టీజర్ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. టీజర్ 24 గంటల్లో 15 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ ల లైక్స్ ను కూడా దక్కించుకుని కని విని ఎరుగని రికార్డును నమోదు చేసింది. ఇంతే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్.. మలేషియాతో పాటు మరి కొన్ని దేశాల్లో కూడా యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచాయి. ఏ ప్రాంతంకు ఆ ప్రాంత ట్రెండ్డింగ్ లు ఉంటాయి. ఇతర దేశాల్లో మన సినిమాల స్టఫ్ ట్రెండ్ అవ్వడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక ప్రాంతీయ భాష సినిమా టీజర్ ఆ దేశాల్లో ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మాస్టర్ సినిమా విడుదలైతే మామూలుగా ఉండదంటూ అభిమానులు ఇప్పటి నుండే వసూళ్ల రికార్డులను అంచనా వేస్తున్నారు.