కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనేలేదు. రాజా రాణి- తేరి- మెర్సల్ (అదిరింది-తెలుగు) చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూడు చిత్రాలు అంచనాల్ని మించి విజయాలు అందుకున్నాయి. మాస్ మసాలా కమర్షియల్ హంగుల్ని జోడిస్తూనే.. స్టైలిష్ మేకింగ్ తో న్యూ జనరేషన్ డైరెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. కమల్ హాసన్-రజనీకాంత్ లాంటి టాప్ స్టార్ల నుంచి ప్రశంలందుకున్నాడు. కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ కు అయితే మంచి స్నేహితుడైపోయాడు. తేరి- మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్లను విజయ్ కి అందించిన అట్లీ తాజాగా విజయ్ తో బిగిల్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పుట్ బాల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొద్ది సేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. మరో హిట్టు ఖాయమనే ట్రైలర్ చెబుతోంది.
కెరీర్ లో హ్యాట్రిక్ ఉన్నా .. దళపతి విజయ్ తో హ్యాట్రిక్ కొట్టి కోలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఉత్సాహాం చూపిస్తున్నాడు. తాజాగా అట్లీ కన్ను హాలీవుడ్ నటులపై పడిందని తెలుస్తోంది. ప్రిడేటర్.. కమెండో లాంటి సంచలన చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిల్ డ్యూక్ తో ఓ భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే అట్లీ ట్యాలెంట్ విశ్వ వేదికపై ఎలివేట్ కావడం ఖాయం.
ఇప్పటివరకూ దక్షిణాది నుంచి హాలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేసిన దర్శకుడు లేడు. దక్షిణాది ట్యాలెంట్ కేవలం బాలీవుడ్ కే పరిమితమైంది. బాలీవుడ్ లో కొంత మంది దర్శకులు చిన్న చితకా సినిమాలు చేసారు గానీ..డ్యూక్ లాంటి బిగ్ స్టార్ తో సినిమాలు చేసిందైతే లేదు. మరి ఇవి రూమర్లా? వాస్తవంగా ప‌్లానింగ్ జరుగుతుందా? అన్నది దర్శకుడు అట్లీనే స్వయంగా ధృవీకరించాల్సి ఉంది.