కోలీవుడ్ సంచలనం ధనుష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ హీరోలందరిలో ధనుష్ క్రేజ్ డిఫరెంట్. వెండి తెరపై ఆయన ఇన్నోవేటివ్ ప్రయోగాలకే ఆ రకమైన గుర్తింపు దక్కింది. హీరో అనే ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి సినిమాలు చేసే అతి కొద్ది మంది స్టార్లలో ధనుష్ ఒకరు. తెరపై ప్యూన్ పాత్ర పోషించి హిట్ అందుకోగలడు. డాన్ పాత్రలోనూ అవలీలగా ఒదిగిపోగలడు.
ధనుష్ అక్కడంత పెద్ద స్టార్ అయ్యాడంటే? తనలో వే ఆఫ్ ఐడియాలిజం అన్నది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ లో చేసింది రెండు..మూడు సినిమాలే అయినా! ఆయన ఇమేజ్ అక్కడా ఎంతో ప్రత్యేకమైనది. తొలి సినిమా 'రాంజానా'తోనే హిందీ బెల్ట్ లో అభిమానులు సంపాదించుకున్నాడంటే? ధనుష్ సత్తా ఏంటో తెలుస్తోంది.
త్వరలో టాలీవుడ్ లో ని సత్తా చాటడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. 'సర్' అనే సినిమాతో తెలుగులో లాంచ్ అవుతున్నాడు. ఏక కాలంలో తమిళ్ భాషలోనూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి స్టార్ మేకర్ శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నారు. కమ్ములా సక్సెస్ ట్రాక్ నేపథ్యంలో ధనుష్ డెబ్యూతోనే సంచలనం అవుతాడని అంచ నాలున్నాయి.
ఇక్కడితో ధనుష్ ఆగిపోలేదు. హాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. 'ది గ్రే మ్యాన్' అనే సినిమాతో హాలీవుడ్ కి వెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్..ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఓటీటీ దిగ్గజం నెఓట్ ప్లిక్స్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడటంతో సినిమా దర్శకులు రూసో బ్రదర్స్ ఏకంగా ధనుష్ కోసం ఇండియాకి వస్తున్నారు.
జోరూసో- అంటోనీ రూసో కేవలం ధనుష్ కోసం ఇండియాకి వస్తున్నట్లు ప్రకటించారు. మేం తీసిన ది గ్రే మ్యాన్ వీక్షించేందుకు.. మా స్నేహితుడు ధనుష్ ని చూసేందుకు ఇండియాకి రావడం ఎంతో సంతోషంగా ఉంది.
త్వరలోనే అందరుం కలుద్దామని తెలిపారు. 'ది గ్రే మ్యాన్' ఇండియాలో తెలుగు..తమిళం..కన్నడం.. హిందీ..మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది. అందుకే సినిమా ప్రచారం హాలీవుడ్ దిగ్గజాల ఎంట్రీతో షురూ అయ్యే అవకాశం ఉంది.