ఈ రోజుల్లో సుఖనిద్ర పట్టడం చాలా కష్టం. రకరకాల ఒత్తిళ్లు కారణాలు కావొచ్చు. కుటుంబ వివాదాలు అయినవారితో పంతాలు వంటివి కొన్ని పరోక్ష కారణాలు ఉండొచ్చు. ఇక పాశ్చాత్య దేశాల్లో ధనికుల ఇండ్లలో ఉండే విపరీతాలు అన్నీ ఇన్నీ కావని డైలీ పత్రికలు మీడియాలు ఘోషిస్తున్నాయి. నిరంతరం విభేధాలు విడాకుల వార్తలతో పేపర్లు చానెళ్లు నిండిపోతున్నాయి.
ఇదిలా ఉంటే సడెన్ గా ముంబైలో ప్రత్యక్షమయ్యాడు ప్రముఖ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్. గత కొంతకాలంగా అతడి ప్రవర్తనపై చాలా రకాల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మానిసక ఒత్తిడిలో అతడు చేస్తున్న వాటి గురించి చర్చ సాగుతూనే ఉంది. ఇంతకుముందు తన మాజీ భార్యను తప్పుగా అన్నందుకు ఒక ప్రముఖ స్టార్ ని హోస్ట్ ని ఆస్కార్ వేదికపైనే చెంప చెల్లుమనిపించాడు విల్ స్మిత్.
కానీ ఇంతలోనే క్షమాపణలు చెప్పాడు. అలా చేసి ఉండాల్సినది కాదని అన్నాడు. ఈరోజు విల్ స్మిత్ కలీనా విమానాశ్రయంలో కనిపించాడు. ముంబైకి ఆకస్మిక పర్యటన చేసాడు. విల్ స్మిత్ ఆస్కార్స్ వేదికపై క్రిస్ రాక్‌తో చెంపదెబ్బ కొట్టాక.. గత రెండు వారాలుగా టీవీ చానెళ్ల ముఖ్యాంశాల్లో నలిగిపోయాడు. ఇంతలోనే ఇలా భారతదేశ పర్యటనతో తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రఖ్యాత నటుడు శనివారం మధ్యాహ్నం ముంబైలో కనిపించాడు. ఆస్కార్ వివాదం ..అవార్డుల వేడుకకు హాజరుకాకుండా అకాడమీ 10 సంవత్సరాల నిషేధాన్ని ప్రకటించిన తర్వాత అతను బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.
అందరు కెమెరామెన్లు అతడిపై విరుచుకుపడ్డారు. వారి మధ్య విల్ స్మిత్ తన పక్కన ఉన్న వ్యక్తిని పలకరించేటప్పుడు పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి కనిపించాడు. అతను ముంబైలోని ప్రైవేట్ కలీనా విమానాశ్రయంలో ఉండగా నవ్వుతూ కనిపించారు.
స్మిత్ భారత పర్యటన ఏదైనా విధినిర్వహణలో భాగం కాదనేది అనేది అస్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ పై వచ్చే పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డుల నుంచి నిషేధం విధించారు. కింగ్ రిచర్డ్ కోసం ఉత్తమ నటుడిగా ఆస్కార్ ను గెలుచుకున్న నటుడు జాడా పింకెట్ స్మిత్ గురించి అసహ్యకరమైన జోక్ చేసిన తర్వాత హాస్యనటుడు క్రిస్ రాక్ ను వేదికపై చెంపదెబ్బ కొట్టడంతో వివాదంలో చిక్కుకున్నాడు.
విల్ స్మిత్ నటిస్తున్న కొన్ని ప్రాజెక్ట్ లు ప్రస్తుతానికి నిలిపివేయడం చర్చనీయాంశమైంది. ఇది నిజంగా స్మిత్ కి పెద్ద దెబ్బ. ఇక విల్ ముంబైలో ప్రత్యక్షమైన విధానం చూస్తుంటే ఈసారి ఆధ్యాత్మిక టూర్ వచ్చాడన్నది స్పష్ఠమవుతోంది. అతడి మెడలో అలంకరణ విధానం చూస్తుంటే ఈ సందేహం రాజుకుంటోంది. అది రుద్రాక్ష మాల తరహాలో కనిపిస్తోంది. ఇంతకుముందు అతడు హిమాలయాల విజిట్ కి శివాలయానికి వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సనాతన భారతదేశ సంస్కృతికి ఆధ్యాత్మికతకు విల్ స్మిత్ ఎంతో గౌరవమిస్తుంటారు. ఇటీవల ఆ గౌరవం అతడిలో మరింతగా పెరుగుతోందని అర్థమవుతోంది.