తెలుగు సినిమా 'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. తొలిసారి ఆస్కార్ బరిలో ఓ తెలుగు సినిమా...ఓ ఇండియన్ సినిమా నిలవడం? నెట్టింట ఈ రేంజ్ లో వైరల్ కావడం ఇదే తొలిసారి. హాలీవుడ్ దిగ్గజాలు మెచ్చిన చిత్రం కావడంతోనే 'ఆర్ ఆర్ ఆర్' కి ఇంత గుర్తింపు దక్కుతోంది.
ఆస్కార్ రేసులోనూ ఏమో ఈ గుర్రం ఎగరావచ్చు! అన్న చందంగా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే అవార్డులు..రివార్డులతో ఆర్ ఆర్ ఆర్ ఓ రేంజ్ లో షేక్ అవుతోంది. ఇటీవలే న్యూయార్క్ ఫిలిం సర్కిల్ బెస్ట్ డైరెక్టర్స్ అవార్డుని రాజమౌళి ఖాతాలో జమ అయింది. ఈ అవార్డు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. గ్రేట్ టెక్నిషియన్లని మాత్రమే ఇలాంటి వాటితో సత్కరిస్తారు.
ఈ అవార్డులు అందుకున్న దర్శకులంతా ఆస్కార్ విన్నర్స్ గా నిలిచిన వారే. ఆ కోవలో అప్పుడే ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో ఆస్కార్ నమోదైందా? అన్న సందేహం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. 'ఆర్ ఆర్ ఆర్' కాస్ట్ అండ్ క్రూ ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' స్పాట్ లైట్ 'అవార్డు విన్నగార్ ప్రకటించింది.
ఫిబ్రవరి 24న జరగనున్న హెచ్ సీ ఏ అవార్డు వేకల్లో దీన్ని ప్రదానం చేయనున్నారు. ఈ వెంట్ ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధికారిక యూ ట్యూబ్ ఛానెల్..ఆపిల్ టీవీలోనూ చూడొచ్చు.
ఇలా వరుసుగా 'ఆర్ ఆర్ ఆర్' ఖాతాలో అవార్డులు జమ అవ్వడంతో ఆస్కార్ సైతం 'ఆర్ ఆర్ ఆర్' సునాయాసంగా సాధిస్తుందంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డుకి ముందు ఇవన్ని శుభ సూచికలు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే భారతదేశ సినీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా 'ఆర్ ఆర్ ఆర్' మిగిలిపోతుంది. భారతదేశం ఎంతో గర్విస్తుంది. ఆ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరూ సినిమా చరిత్రలోనే నిలిచిపోతారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.