RRR చూసి హాలీవుడ్ రైటర్ ఫిదా

Update: 2022-06-07 10:34 GMT
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కేవలం ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రత్యేకంగా స్పందిస్తూ ఉండడం విశేషం.

ఇండియన్ సినిమా ప్రతి ఏడాది ఏదో ఒక పెద్ద సినిమాతో ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇక హాలీవుడ్ ప్రముఖులు కూడా ఇండియా లో సక్సెస్ సాధించిన పెద్ద సినిమాలను ప్రత్యేకంగా వీక్షిస్తూ వాటిపై పాజిటివ్ రివ్యూలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా బాచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ RRR పై డాక్టర్ స్ట్రేంజ్ మూవీ రైటర్ చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

గత రాత్రి, డాక్టర్ స్ట్రేంజ్ రచయిత రాబర్ట్ కార్గిల్ ఈ చిత్రంపై తన అభిప్రాయాలను ట్విట్టర్ లో తెలియజేశాడు. RRR సినిమాను చూడాలి అని గత రాత్రి కొంతమంది స్నేహితులు నా దగ్గరికి వచ్చారు.

అయితే నేను సినిమాను చూడగానే చాలా ఆసక్తికరమైన అంశంతో అత్యంతం చాలా క్రేజీగా ఉంది. నిజంగా ఇదొక సిన్సియర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాను మరొకసారి నేను వీక్షించాలని అనుకుంటున్నట్లు రాబర్ట్ వివరణ ఇవ్వడం విశేషం. మరొకసారి తన భార్యతో కలిసి ఈ సినిమా చూడడానికి ఈ ప్రముఖ రచయిత సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కూడా RRR సినిమా నెట్ ఫ్లెక్స్ లో హిందీ వెర్షన్ భారీ స్థాయిలో వ్యూస్ అందుకోవడం విశేషం. ఒక విధంగా ఇటీవల కాలంలో నెట్ ఫ్లిక్స్  సంస్థలో యూజర్స్ చాలావరకు తగ్గిపోవడంతో నష్టాల బారిన పడింది.

ఇక ఈ సినిమా ద్వారా ఈ సంస్థకు మరో కొంత బూస్ట్ లభించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు  అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా RRR కొనసాగుతోంది.
Tags:    

Similar News