స్వ‌లింగ సంప‌ర్కం.. గ‌ల్ఫ్‌ దేశాల్లో దెబ్బ ప‌డిందే!

Update: 2020-02-22 01:30 GMT
వైవిధ్యం కేరాఫ్ ఆయుష్మాన్ అంటే అతిశ‌యోక్తి కాదు. త‌న‌కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని స‌త్తా చాటుతున్న‌ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా. బ్యాక్ గ్రౌండ్ తో ప‌ని లేకుండా కేవ‌లం ట్యాలెంట్.. మైండ్ గేమ్ తో బాలీవుడ్ లో నెగ్గుకొస్తున్నాడు. వార‌స‌త్వ తార‌ల‌ డామినేష‌న్ రాజ్య‌మేలే చోట ఇలాంటి కొత్త ఆలోచ‌న‌లు ఉన్న కుర్రాళ్ల‌ను ఆప‌గలిగే శ‌క్తి ఏదీ లేద‌ని ప్రూవ్ చేశాడు. అత‌డి క‌థ‌ల ఎంపికే సెన్సేష‌న్. ఇదివ‌ర‌కూ వీర్య‌దానం కాన్సెప్ట్ .. బ‌ట్ట త‌ల క‌థ‌.. అమ్మాయిగా ఏడిపించే అబ్బాయి క‌థ‌ల్లో న‌టించాడు. ప్ర‌యోగాలెన్నో చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడు.

అందుకే అత‌డి నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే అంద‌రిలో ఒక‌టే ఆస‌క్తి. తాజాగా స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమాతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్‌' అనేది టైటిల్. అయితే ఈ సినిమా రిలీజ్ ముంగిట అత‌డికి ర‌క‌ర‌కాలుగా చిక్కుల్ని తెస్తూనే ఉంది. స్వలింగ సంపర్కం కథాంశంపై అభ్యంత‌రం చెబుతూ రెండు దేశాలు రిలీజ్ ని అడ్డుకోవడం వివాదాస్ప‌దంగా మారింది. భారత్ లోని ఓ గ్రామానికి చెందిన‌ ఇద్దరు యువకుల మధ్య ప్రేమ కథను తెర‌పై చూపారు.  

సెక్సువ‌ల్ కంటెంట్ నిండిన క‌థాంశం కావ‌డంతో ఈ సినిమాని సనాతన ఆచారాలను పాటించే దుబాయ్- యూఏఈలో నిషేధించారు. ఇందులో ఆ త‌ర‌హా స‌న్నివేశాల్ని తొల‌గించామ‌ని చిత్ర‌బృందం చెబుతున్నా ఆయా దేశాల్లో నిషేధించ‌డం వివాదాస్ప‌దం అయ్యింది. గజ్ రాజ్ రావు- నీనా గుప్తా తదితరులు ఇందులో నటించారు. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా- జితేంద్ర మధ్య ముద్దు సీన్లను తొలగిస్తామని చెప్పినా అందుకు అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ప్ర‌స్తుతం గ‌ల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం రిలీజ‌వుతుందా లేదా? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి.
Tags:    

Similar News